Health Tips : టేస్ట్‌తో పాటు పలు ఆరోగ్య ప్రయోజనాలను అందించే స్నాక్స్ కోసం చూసేవారికి పలు ప్రత్యామ్నాయాలున్నాయి. పోషక విలువలను అందించడంతో పాటు కడుపు నిండిన భావన కలిగించే స్నాక్స్ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కొవ్వులు, షుగర్, సాల్ట్, ప్రాసెస్డ్ స్నాక్స్‌కు బదులు హెల్దీ స్నాక్స్‌ను ఎంజాయ్ చేయవచ్చు.
పండ్లు, కూరగాయలు, నట్స్, సీడ్స్, తృణధాన్యాలతో తయారుచేసిన స్నాక్స్ రుచితో పాటు ఆరోగ్యానికీ మేలు చేస్తాయి. ఇక గుండెకు మేలు చేస్తూ బరువు తగ్గే ప్రక్రియకు ఊతమిచ్చే ఐదు ఆరోగ్యకర స్నాక్స్‌ను ప్రయత్నించవచ్చని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. వీటిలో ముందుగా వేయించిన శనగలు గుండెకు మేలు చేయడంతో పాటు బరువు తగ్గేందుకూ సాయపడతాయి.
వేయించిన శనగల్లో మెగ్నీషియం, పొటాషియం వంటివి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వీటిలో ఫైబర్ అధికంగా ఉండటంతో అవి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వీటిలో చాట్ మసాలా, ధనియాల పౌడర్, బ్లాక్ పెప్పర్ వంటివి వేసి టేస్టీ స్నాక్‌ను ఆస్వాదించవచ్చు. ఇక హార్ట్‌కు మేలు చేసే ఐదు స్నాక్స్‌ను పరిశీలిస్తే..
రోస్టెడ్ చిక్పీస్ (చనా)
స్ర్పౌట్ చాట్
మసాలా ఓట్స్
మిక్స్డ్ ఫ్రూట్ సలాడ్
వెజిటబుల్ ఉప్మా
Read More :
IndiGo passenger smokes ‘beedi’ | విమానంలో బీడీ కాల్చిన ప్రయాణికుడు.. తర్వాత ఏం జరిగిందంటే?