ముంబై: విమానం గాలిలో ఉండగా ఒక ప్రయాణికుడు బీడీ కాల్చాడు. (IndiGo passenger smokes ‘beedi’) గమనించిన విమాన సిబ్బంది అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. విమానం ఎయిర్పోర్ట్లో ల్యాండ్ కాగానే పోలీసులకు అప్పగించారు. మంగళవారం ఇండిగో విమానం ఢిల్లీ నుంచి ముంబైకి బయలుదేరింది. విమానం గాలిలో ఉండగా 42 ఏళ్ల ప్రయాణికుడు టాయిలెట్లో బీడీ కాల్చాడు. వాసన గమనించిన సిబ్బంది ఆ వ్యక్తిని అడ్డగించి ప్రశ్నించారు. దీంతో బీడీ స్మోక్ చేసినట్లు అతడు ఒప్పుకున్నాడు.
కాగా, ముంబై ఎయిర్పోర్ట్లో ఇండిగో విమానం ల్యాండ్ కాగానే విమానాశ్రయంలోని పోలీసులకు ఆ వ్యక్తిని అప్పగించారు. దీంతో అతడ్ని అరెస్ట్ చేశారు. విమానం, ప్రయాణికుల భద్రతకు ముప్పు కలిగించడం వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విమానంలో సిగరెట్, బీడీ స్మోక్ చేసిన సంఘటనలు
గతంలో కూడా జరిగాయి.