గుండెకు దన్ను
జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా చిన్న వయసులోనే గుండె జబ్బులు వస్తున్నాయి. గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ పోషకాహార లోపం రాకుండా జాగ్రత్తపడాలి.
జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా చిన్న వయసులోనే గుండె జబ్బులు వస్తున్నాయి. గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ పోషకాహార లోపం రాకుండా జాగ్రత్తపడాలి. గుండెకు విటమిన్లు, మినరల్స్ చేసే మేలు తెలిసిందే. అయితే ఆ మేలైన పోషకాలు అధికంగా ఉండే పండ్ల గురించి, అవి చేసే మేలు గురించి తెలుసుకుందాం.
గుండె సంబంధిత వ్యాధుల్లో రక్తనాళాల పనితీరు దెబ్బతినడం, దీర్ఘకాలిక వాపు, రక్తంలో లిపిడ్ల అసమతుల్యత, అధిక రక్తపోటు, ఇన్సులిన్ నిరోధకత ముఖ్యమైనవి. ఆహారం ఈ సమస్యలకు పరిష్కారం చూపుతుంది. పండ్లను ఫంక్షనల్ ఫుడ్స్‌గా పరిగణిస్తారు. ఇవి పాలీఫెనాల్స్, ఫ్లేవనాయిడ్స్, పొటాషియం, పీచు పదార్థం వంటి వివిధ బయోయాక్టివ్ సమ్మేళనాలను అందిస్తాయి. ఈ సమ్మేళనాలు రక్తనాళాల పనితీరును మెరుగుపరచడంలో, లిపిడ్ జీవక్రియను నియంత్రించడంలో, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. అందువల్ల, బ్లూబెర్రీలు, స్ట్రాబెర్రీలు, నారింజ, నిమ్మకాయలు, ఆపిల్స్, దానిమ్మ, అరటి, అవకాడో వంటి పండ్లను తింటే గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది.
దానిమ్మ: గుండె ఆరోగ్యానికి అత్యుత్తమమైన పండు ఏదైనా ఉందంటే, అది నిస్సందేహంగా దానిమ్మ. ఇందులోని యాంటి ఆక్సిడెంట్లు రక్తనాళాల్లో పేరుకుపోయిన తక్కువ సాంద్రత కలిగిన కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తాయి. అందువల్ల రక్త ప్రసరణ ఆటంకాలు లేకుండా జరుగుతుంది. ప్రతిరోజూ ఒక కప్పు దానిమ్మ గింజలు లేదా తాజా దానిమ్మ రసం తీసుకోవడం రక్తపోటును అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది. ధమనుల గోడలు గట్టిపడకుండా నివారించడంలో దానిమ్మ పండుకు మరొకటి సాటి లేదు.
ఆపిల్, నారింజ: ‘రోజుకు ఒక ఆపిల్ తింటే చాలు.. డాక్టర్ అవసరం ఉండదు’ అనే సామెత అక్షరాలా నిజం. ఆపిల్ పండులో ఉండే పెక్టిన్ ఫైబర్, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. నారింజ పండ్లు కూడా గుండెకు ఎంతో మేలు చేస్తాయి. నారింజలో ఉండే విటమిన్ సి, పొటాషియం రక్తపోటును అదుపులో ఉంచడానికి సహాయపడతాయి. ఇందులోని ఫ్లేవనాయిడ్లు వాపులను తగ్గిస్తాయి. గుండె కొట్టుకోవడం క్రమబద్ధంగా ఉండేలా చూస్తాయి. ఈ రెండు పండ్లు గుండెకు రక్షణ కవచాలుగా పనిచేస్తూ, దీర్ఘకాలిక వ్యాధుల నుండి కాపాడతాయి.
ఇవి కూడా
మార్కెట్లో తక్కువ ధరలకు లభించే జామ, ఉసిరి, బొప్పాయి గుండెకు ఎంతో మేలు చేస్తాయి. జామలో పొటాషియం, ఫైబర్ పుషలంగా ఉంటాయి. ఈ పోషకాలు గుండె కండరాలను బలోపేతం చేస్తాయి. ఉసిరిలోని విటమిన్ సి రక్తనాళాలను శుభ్రపరచడానికి సహాయపడుతుంది. బొప్పాయిలో ఉండే లైకోపిన్, విటమిన్ సి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. స్థానికంగా లభించే ఈ పండ్లను ప్రతిరోజూ తినడం వల్ల గుండెకు అవసరమైన ఖనిజాలు, విటమిన్లు పుషలంగా అందుతాయి.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పెట్టుబడిదారులకు రక్షణ కరువు.. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు అనువైన పరిస్థితులు లేవు
మోదీజీ.. ఎంతమంది పోలీసులనైనా తెచ్చుకోండి.. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ
ఇద్దరు పిల్లలతో తల్లి బలవన్మరణం
గిరిజన భూములు పరిరక్షించాలి.. రౌండ్‌టేబుల్ సమావేశంలో ఏపీ, తెలంగాణకు వక్తల విజ్ఞప్తి
కాంగ్రెస్ కూటమికి పరాభవం!.. ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల్లో ఈయూ కూటమి ప్రభంజనం
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

