HomeHealthHealth Tips Know About The Warning Signs Of Kideny Stones
Kidney Stones | కిడ్నీలో రాళ్లు ముందుగా ఎలా గుర్తించాలి? ఈ లక్షణాలు ఉన్నాయేమో గమనించండి!
ఇటీవల చాలామంది కిడ్నీలో రాళ్లతో బాధపడుతున్నారు. పని ఒత్తిడి, ఇతరత్రా కారణాలతో నీళ్లను తక్కువగా తాగడం వల్ల ఈ సమస్య వస్తుంది. నీళ్లు తక్కువగా తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన సోడియం లాంటి మినరల్స్, ఇతర వ్యర్థాలు చిక్కగా, గట్టిగా మారతాయి. దీనివల్ల ఆ మలినాలు బయటకు వెళ్లలేక రాళ్లలా మారిపోతాయి.
2/7
ఇలా కిడ్నీలో రాళ్లు ఏర్పడినప్పుడు మన శరీరంలో పలు మార్పులు వస్తాయి. వాటి ద్వారా మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడిన విషయాన్ని పసిగట్టవచ్చు. ముందే గుర్తించడం ద్వారా శస్త్ర చికిత్సకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే రాళ్లను తొలగించుకోవచ్చు. మరి ఆ లక్షణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
3/7
కిడ్నీలో రాళ్లు ఉంటే మూత్ర విసర్జన సమయంలో విపరీతమైన నొప్పి వస్తుంది. దీన్ని డైసూరియా అని పిలుస్తారు. మూత్రాశయం, బ్లాడర్ మధ్యలో రాయి ఉన్నప్పుడు ఈ సమస్య వస్తుంది. ఒకవేళ కిడ్నీలో రాళ్ల సమస్యను గుర్తించకపోతే.. అవి యూరినరీ ట్రాక్ ఇన్‌ఫెక్షన్‌కు దారితీసే ప్రమాదం ఉంది.
4/7
మూత్రంలో రక్తం రావడం కూడా కిడ్నీలో రాళ్లు ఉన్నయనడానికి సంకేతం. దీన్ని హెమటూరియా అని పిలుస్తారు. మూత్రం ఎరుపు, గులాబీ లేదా గోధుమ రంగులో వస్తుంటే.. కిడ్నీలో రాళ్లు ఉన్నాయేమో చెక్ చేయించుకోవడం మంచిది. కొన్ని సందర్భాల్లో మూత్రంలో వచ్చే రక్తం చిన్న చిన్న కణాలుగా.. కంటికి కనడబడనంత చిన్నవిగా ఉంటాయి. దీన్నే మైక్రోస్కోపిక్ హెమటూరియా అని పిలుస్తారు.
5/7
కిడ్నీలో రాళ్ల సమస్య ఉంటే.. మూత్రం చిక్కగా, దుర్వాసనతో ఉంటుంది. బ్యాక్టీరియా కారణంగా మూత్రం వాసన రావచ్చు. యూరినరీ ట్రాక్ ఇన్‌ఫెక్షన్ ఉన్నప్పుడే ఇలా వస్తుంది.
6/7
కిడ్నీలో రాళ్లు ఉంటే తరచూ జ్వరం వస్తుంది. యూరినరీ ట్రాక్ ఇన్‌ఫెక్షన్ కారణంగా జ్వరం ఎక్కువగా ఉంటుంది. దాదాపు 100.4 డిగ్రీల ఫారన్‌హీట్ కంటే కూడా ఎక్కువ టెంపరేచర్ ఉంటుంది.
7/7
వికారం, వాంతులు వంటి సాధారణ లక్షణాలు కూడా కనిపిస్తాయి. కిడ్నీలో రాళ్ల కారణంగా జీర్ణాశయాంతర నాళాలు యాక్టివ్ అవుతాయి. ఫలితంగా పొత్తి కడుపులో నొప్పి వస్తుంది.
8/7
కిడ్నీలో రాళ్లు ఏర్పడితే విపరీతమైన నొడుము నొప్పి ఉంటుంది. ఈ నొప్పి బొడ్డు, పొత్తి కడుపు ద్వారా వ్యాపిస్తుంది. ఈ నొప్పి కారణంగా నిలబడలేరు. నడవడం కూడా కష్టంగా ఉంటుంది.