Health tips : మీరు అధిక బరువుతో బాధపడుతున్నారా..? మీ జీవక్రియా రేటు పూర్తిగా మందగించిందా..? డైట్ పాటించినా వెయిట్ మాత్రం కంట్రోల్ కావడం లేదా..? బరువు తగ్గడం అనేది మీకు ఓ పరిష్కారం లేని సమస్యగా మారిపోయిందా..? అయితే ఇకపై మీరు చింతించకండి. ఏదో ఒక పదార్థాన్ని కాకుండా బరువు తగ్గించే లక్షణాలున్న కొన్ని పదార్థాలను మీ డైట్లో భాగం చేసుకోండి. మీ సమస్య తప్పక పరిష్కారం అవుతుంది. బరువు తగ్గేందుకు తోడ్పడే ఓ 8 రకాల ఆహారపదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
మనం ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవాలి. నిత్యం వ్యాయామం చేయాలి. ఆహారంలో కోడిగుడ్లను భాగం చేసుకోవాలి. కోడిగుడ్లలో ప్రొటీన్, కొవ్వులు అధికంగా ఉంటాయి. ఇవి మనకు కడుపునిండిన భావన కల్పించి అతిగా తినకుండా చేస్తాయి. ఫలితంగా బరువు తగ్గేందుకు తోడ్పడుతాయి.
పాలకూర, తోట కూర లాంటి ఆకు కూరల్లో ఫైబర్, పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి తరచూ తీసుకుంటే శరీరం ఎప్పుడూ హైడ్రేట్‌గా ఉంటుంది. మనకు కావాల్సినంత తీసుకోగానే కడుపు నిండిన భావన కలిగిస్తాయి. దాంతో అతిగా తినకుండా ఉంటాం. ఫలితంగా బరువు తగ్గుతాం.
చేపల్లో అత్యంత నాణ్యమైన ప్రొటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఇతర ముఖ్య పోషకాలు ఉంటాయి. మన శరీరానికి అవసరమైనంత తీసుకోగానే కడుపు నిండిన ఫీల్ కలుగుతుంది. దాంతో బరువును అదుపులో ఉంచుకోవచ్చు. అంతేగాక చేపలు, సీ ఫుడ్ తీసుకోవడం వల్ల కావాల్సినంత అయోడిన్ శరీరానికి అందుతుంది. ఇది థైరాయిడ్ గ్రంథి సక్రమంగా పనిచేయడానికి, జీవక్రియల నిర్వహణకు దోహదపడుతుంది.
చిక్కుళ్లు, ఉలవలు, పెసలు, బొబ్బెర్లు, బ్లాక్ బీన్స్, కిడ్నీ బీన్స్ లాంటి ఇతర లెగ్యూమ్స్ కూడా బరువు తగ్గడానికి తోడ్పడుతాయి. వీటిలో ఫైబర్లు, ప్రొటీన్లు అధిక మోతాదులో ఉంటాయి. కాబట్టి వీటిని కొద్దిగా తీసుకోగానే కడుపునిండిన భావన కలుగుతుంది. అంతేగాక వీటిలో శరీరానికి కావాల్సిన మోతాదులోనే కార్బోహైడ్రేట్స్ ఉంటాయి.
బ్రకోలీ, క్యాలీఫ్లవర్, క్యాబేజీ లాంటి కూరల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఫైబర్ రిచ్ ఫుడ్స్‌తో కడుపు నిండిన భావన కలిగి అతిగా తినకుండా ఉంటాం. దాంతో ఆటోమాటిక్‌గా బరువు తగ్గుతాం. కాబట్టి మీరు బరువు తగ్గాలంటే మీ డైట్లో బ్రకోలీ, క్యాలీఫ్లవర్, క్యాబేజీని భాగం చేసుకోవాలి.
స్కిన్లెస్ చికెన్ బ్రెస్ట్, లీన్ మీట్ (పలుచని రెడ్ మీట్) లో ప్రొటీన్, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి బరువు తగ్గడంలో తోడ్పడుతాయి. అయితే వీటిలో టేస్టు కోసం మసాలాలు అధికంగా జోడించడం మానుకోవాలి. అధిక మసాలాల వల్ల వాటితో ప్రయోజనం లేకుండా పోతుంది.
ఆలుగడ్డ, కందగడ్డ, మొరంగడ్డ లాంటి దుంపల్లో బరువు తగ్గడానికి కావాల్సిన అన్ని క్వాలిటీస్ ఉన్నాయి. అయితే వీటిని వేపుళ్ల రూపంలో తీసుకోవద్దు. ఉడికించి, రోస్ట్ చేసి తీసుకోవడం ద్వారా వీటితో ప్రయోజనం ఉంటుంది.