Health tips | నోటి పుండ్లు మిమ్మల్ని వేధిస్తున్నాయా.. అయితే ఈ సింపుల్ టిప్స్ మీ కోసమే..!
Health tips | శరీరంలో వేడి ఎక్కువగా ఉండే వాళ్లను, పంటి ఇన్ఫెక్షన్లు ఉన్నవాళ్లను నోటిపూత (నోట్లో పుండ్లు పడటం-Mouth Ulcer) తీవ్రంగా వేధిస్తుంది. నోటిపూత వల్ల భయంకరమైన నొప్పి ఉంటుంది. పుండు నోట్లో ఎక్కడ ఉన్నా తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది. అయితే శరీరంలో వేడి బాగా ఉన్నప్పుడు నోరంతా పుండ్లు పడుతాయి.
Health tips : శరీరంలో వేడి ఎక్కువగా ఉండే వాళ్లను, పంటి ఇన్ఫెక్షన్లు ఉన్నవాళ్లను నోటిపూత (నోట్లో పుండ్లు పడటం-Mouth Ulcer) తీవ్రంగా వేధిస్తుంది. నోటిపూత వల్ల భయంకరమైన నొప్పి ఉంటుంది. పుండు నోట్లో ఎక్కడ ఉన్నా తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది. అయితే శరీరంలో వేడి బాగా ఉన్నప్పుడు నోరంతా పుండ్లు పడుతాయి. ఇక ఆ నరకయాతన వర్ణనాతీతం. ఇంతలా వేధించే ఈ నోటిపూత సమస్య నుంచి చిన్నచిన్న చిట్కాలతో బయటపడవచ్చు. మరి ఆ సింపుల్ చిట్కాలు (Simple Tips) ఏమిటో ఇప్పుడు చూద్దాం..
చిట్కాలు
నోటిపూత సమస్యతో బాధపడే వాళ్లు కొబ్బరి నీళ్లు బాగా తాగాలి. కొబ్బరి నీళ్లకు ఒంట్లో వేడిని తగ్గించే లక్షణం ఉంటుంది. కాబట్టి కొబ్బరి నీళ్లు తాగడంవల్ల ఒంట్లో వేడి తగ్గి సమస్య పరిష్కారమవుతుంది.
ఎండు కొబ్బరిని నమలడంవల్ల కూడా నోటిపూతకు మంచి పరిష్కారం లభిస్తుంది. ఎండు కొబ్బరిని నమలడంవల్ల అల్సర్ పుండ్లలోని సూక్ష్మజీవులు నశించిపోతాయి. దాంతో నోటిలో అల్సర్స్ త్వరగా తగ్గిపోతాయి.
అదేవిధంగా అల్సర్ ఉన్న ప్రాంతాల్లో కొబ్బరి నూనె రాయడంవల్ల కూడా నోటిపూత నుంచి ఉపశమనం లభిస్తుంది. నూనె రాయడంవల్ల ఇన్ఫెక్షన్ త్వరగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది.
అంతేగాక తరచూ చల్ల (బట్టర్ మిల్క్) తాగడంవల్ల కూడా నోటిలో అల్సర్స్ సమస్యకు పరిష్కారం ఉంటుంది. చల్లకు కూడా శరీరంలోని వేడిని తగ్గించే లక్షణం ఉన్నది.
ఇక గసగసాలు కూడా నోటిపూతను తగ్గించడంలో చాలా బాగా పనిచేస్తాయి. గసగసాలు కలిపిన నీటిని తరచూ తాగుతూ ఉండటంవల్ల సమస్య నుంచి తొందరగా బయటపడవచ్చు.
అదేవిధంగా తులసి ఆకులు నోటిపూత సమస్యకు చక్కని పరిష్కారం చూపుతాయి. తరచూ తులసి ఆకులను నములుతూ, వాటి నుంచి వచ్చే రసాన్ని మింగడం ద్వారా కూడా నోటిపూతకు పరిష్కారం లభిస్తుంది.
గమనిక : పై చిట్కాలు సమస్య రాకుండా చూసుకోవడానికి, వచ్చిన సమస్య నిదానంగా తగ్గడానికి తోడ్పడుతాయి. ఒకవేళ మీకు నోరంతా పుండ్లుపడి భరించలేకుండా ఉంటే మాత్రం వైద్యులను సంప్రదించి మెడికేషన్ తీసుకోవడం ఉత్తమం.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health tips | నోటి పుండ్లు మిమ్మల్ని వేధిస్తున్నాయా.. అయితే ఈ సింపుల్ టిప్స్ మీ కోసమే..!
Job Fraud | ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని మహిళ నుంచి రూ.4.50 లక్షలు వసూలు.. ఆపై రిసార్ట్‌కు తీసుకెళ్లి అత్యాచారం
Car Race: బ్రిటన్‌లో కారు రేస్.. ఇద్దరు భారత సంతతి వ్యక్తులకు 28 ఏళ్ల జైలుశిక్ష
Nani | ‘బ్లడీ రోమియో’లో బాలీవుడ్ నటుడు.. కీలక పాత్రలో కనిపించనున్న ‘ధురంధర్’ ఫేమ్!
Sowcar Janaki | షావుకారు జానకి కుమార్తెకు ప్రమాదం.. వీల్‌చైర్ నుంచి కిందపడి ఇబ్బందులు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

