మఖానా, ఫాక్స్ నట్స్, లోటస్ సీడ్స్గా పేరొందిన తామర గింజలతో (Makhana)బోలెడు ఆరోగ్య ప్రయోజనాలున్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. సమతులాహారంలో భాగంగా వీటిని పరిమిత మోతాదులో తీసుకుంటే శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. మఖానా లో క్యాలరీ స్నాక్‌గా పేరొందడంతో బరువు తగ్గాలనుకునేవారికి ఇది దివ్యౌషధంగా ముందుకొస్తుంది.
మఖానాలో సంతృప్త కొవ్వులు తక్కువగా ఉండటంతో పాటు కొలెస్ట్రాల్‌ను దరిచేరనివ్వు. హార్ట్ హెల్తీ స్నాక్‌గా కూడా మఖానా ఎంతో శ్రేష్టమని న్యూట్రిషియన్లు చెబుతున్నారు. ఇందులో ప్లాంట్ బేస్డ్ ప్రొటీన్ అధికంగా ఉండటంతో శక్తిని, ఉత్తేజాన్నీ అందిస్తుంది. శరీర పనితీరుకు, కండపుష్టికీ మఖానా స్నాక్స్ మేలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
ఇక మఖానాలో అత్యధిక ఫైబర్ ఉండటంతో మలబద్ధకాన్ని నివారించి జీర్ణక్రియ సాఫీగా సాగేందుకు ఉపకరిస్తుంది. మఖానాను రోస్ట్, వేపుడు వంటి పలు రూపాల్లో స్నాక్స్‌గా తీసుకోవడంతో పాటు కూరలు, డెజెర్ట్స్లో వాడుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే మఖానాలో కేమ్ప్ఫెరోల్ వంటి యాంటీఆక్సిడెంట్లు ఉండటంతో ఇవి ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి కణాలను కాపాడుతూ తీవ్ర అనారోగ్యాలు, వ్యాధుల బారినపడకుండా కాపాడతాయి.
Read More