precaution dose | ప్రికాషన్ డోస్ ఎప్పుడు వేసుకోవాలి? రెండో డోస్ తర్వాత ఎంత గ్యాప్ ఇవ్వాలి?

precaution dose | దేశంలో ఒమిక్రాన్ వ్యాప్తి, కరోనా థర్డ్ వేవ్‌పై ఆందోళనల నేపథ్యంలో కోవిడ్ టీకా బూస్టర్ డోస్‌పై ప్రస్తుతం అంతటా టాక్ వినిపిస్తున్నది. దీని కోసం పలు రాష్ట్రాలు, రాజకీయ పార్టీల నేతలు డిమాండ్ చేస్తుండటంతో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతున్నది. ఇప్పటికే కొన్ని దేశాల్లో బూస్టర్ డోసు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఈ క్రమంలో 60 ఏండ్ల వయసు దాటి, ఇతరత్రా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి వైద్యుల సలహాపై ప్రికాషన్ డోస్ అందించనున్నట్లు నరేంద్ర మోదీ శనివారం ప్రకటించారు. అయితే కరోనా వ్యాక్సిన్ రెండో డోస్ తీసుకున్న తర్వాత ఎన్ని రోజుల వ్యవధిలో ప్రికాషన్ డోస్ ఇవ్వాలనే దానిపై కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తున్నది. రెండో డోస్, ప్రికాషన్ డోస్ మధ్య 9-12 నెలల గ్యాప్ ఉండాలని కేంద్రం భావిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దీనిపై త్వరలోనే తుది నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నాయి.
ప్రస్తుతం తొలి, రెండో డోసు టీకా మధ్య విరామం పాటించడం వల్ల మంచి ఫలితాలు వస్తున్నట్లు ప్రభుత్వం భావిస్తున్నదని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ‘ఇమ్యునైజేషన్ విభాగం, నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ (ఎన్టీఏజీఐ) ఈ మార్గాలపై చర్చిస్తున్నందున కోవిడ్ వ్యాక్సిన్ రెండవ, ప్రికాషన్ డోస్ మధ్య అంతరం తొమ్మిది నుండి 12 నెలల వరకు ఉండవచ్చు’ అని తెలిపాయి.
కాగా, కరోనాపై పోరాటంలో ముందున్న ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్‌లైన్ వారియర్స్‌తో పాటు 60 ఏండ్లు పైబడిన వారికి ప్రికాషన్ డోస్ (బూస్టర్ డోసు) అందిస్తామని శనివారం జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రధాని మోదీ వెల్లడించారు.
ఇవి కూడా చదవండి..
Delmicron | డెల్మిక్రాన్.. డెల్టా, ఒమిక్రాన్ కంటే ఇది ప్రమాదకరమా?
థర్డ్‌వేవ్ వచ్చేసిందా!.. దేశంలో ఒమిక్రాన్ బుసలు..
కరోనా గత వేరియంట్లతో ఊపిరి ఆడకపోయేది.. ఒమిక్రాన్‌లో ఈ లక్షణం ఎందుకు లేదు?
Omicron variant symptoms | గొంతులోనే వైరస్.. ఒమిక్రాన్ వేరియంట్ లక్షణాలివే..
ఒమిక్రాన్‌తో కరోనా వైరస్ అంతం కాబోతుందా? శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారు?
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

