Fruits For Skin Health | చర్మం మృదువుగా, తేమగా ఉండడంతోపాటు సురక్షితంగా ఉండాలని, కాంతివంతంగా మారి మెరవాలని చాలా మంది కోరుకుంటుంటారు. అందులో భాగంగానే చర్మ సంరక్షణకు అనేక మార్గాలను అనుసరిస్తుంటారు. కొందరు బ్యూటీ పార్లర్ చికిత్సలను తీసుకుంటారు. ఇంకా కొందరు ఇంట్లోనే పలు చిట్కాలను పాటిస్తుంటారు. అయితే చర్మ సౌందర్యం, సంరక్షణ కోసం ఆయా చికిత్సలను, చిట్కాలను పాటించడం సరైందే అయినప్పటికీ ఆహారం విషయంలోనూ మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. మనం తినే ఆహారం సరిగ్గా ఉంటేనే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. చర్మ సంరక్షణకు ఆహారం కూడా చాలా ముఖ్యమైందే అన్న విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలి. ఈ క్రమంలోనే పలు రకాల పండ్లను రోజువారి ఆహారంలో భాగం చేసుకుంటే దాంతో చర్మాన్ని సురక్షితంగా ఉంచుకోవచ్చు. ఇక ఆ పండ్లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలు, రాస్ప్ బెర్రీల వంటి బెర్రీ పండ్లను రోజూ తింటుంటే చర్మాన్ని సురక్షితంగా ఉంచుకోవచ్చు. ఈ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లతోపాటు విటమిన్ సి అధిక మొత్తంలో ఉంటుంది. ఇవి చర్మాన్ని దృఢంగా మార్చి యవ్వనంగా ఉండేలా చేస్తాయి. ఈ పండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల వల్ల ఫ్రీ ర్యాడికల్స్ తొలగిపోతాయి. దీని వల్ల కణాలకు జరిగే నష్టం నివారించబడుతుంది. దీంతో వృద్ధాప్య ఛాయలు రాకుండా అడ్డుకోవచ్చు. చర్మం మృదువుగా మారి కాంతివంతంగా ఉంటుంది. యవ్వనంగా కనిపిస్తారు. అలాగే సిట్రస్ జాతికి చెందిన నిమ్మ, నారింజ వంటి పండ్లను కూడా తింటుండాలి. ఈ పండ్లలోనూ విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయం చేస్తుంది. దీని వల్ల చర్మం సాగే గుణాన్ని పొందుతుంది. ముఖంపై ఉండే ముడతలు తగ్గిపోతాయి. ఈ పండ్లను తింటుంటే చర్మం కాంతివంతంగా మారుతుంది. ముఖంపై ఉండే నల్లని మచ్చలు, మొటిమలు తొలగిపోతాయి. చర్మం సురక్షితంగా ఉంటుంది.
బొప్పాయి పండ్లు మనకు ఏడాది పొడవునా అన్ని సీజన్లలోనూ అందుబాటులో ఉంటాయి. ఈ పండ్లు మన చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ పండ్లలో పపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది ఎక్స్‌ఫోలియేటింగ్ గుణాలను కలిగి ఉంటుంది. కనుక చర్మంపై ఉండే మృతకణాలు తొలగిపోతాయి. బొప్పాయి పండ్లలో ఉండే వటమిన్లు ఎ, సి, ఇ వల్ల మొటిమలు తగ్గి చర్మం కాంతివంతంగా మారుతుంది. నల్లని మచ్చలు తొలగిపోతాయి. బొప్పాయిలో ఉండే యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాల వల్ల చర్మ వాపులు తగ్గిపోతాయి. చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. దానిమ్మ పండ్లను తింటున్నా కూడా చర్మానికి మేలు జరుగుతుంది. ఈ పండ్లలో పాలిఫినాల్స్తోపాటు యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి సూర్యుని నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాల బారి నుంచి చర్మాన్ని రక్షిస్తాయి. ఈ పండ్లలో యాంటీ ఏజింగ్ గుణాలు ఉంటాయి. కనుక వీటిని తింటే వృద్ధాప్య ఛాయలు తగ్గుతాయి. యవ్వనంగా కనిపిస్తారు. ముఖ సౌందర్యం పెరుగుతుంది.
అరటి పండ్లలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది చర్మానికి కావల్సిన తేమను అందిస్తుంది. ఈ పండ్లలో విటమిన్లు ఎ, బి, ఇ అధికంగా ఉంటాయి. కనుక అరటి పండ్లను తింటే పొడి చర్మం ఉన్నవారికి మేలు జరుగుతుంది. అరటి పండ్లను ఫేస్ ప్యాక్‌గా కూడా ఉపయోగించవచ్చు. దీంతో ముఖానికి కావల్సిన తేమ, మృదుత్వం లభిస్తాయి. ముఖం కాంతివంతంగా మారి మెరుస్తుంది. పుచ్చకాయలు, కీరదోసలను కూడా తరచూ ఆహారంలో భాగం చేసుకోవాలి. వీటిల్లో నీరు అధిక మొత్తంలో ఉంటుంది. ఇది చర్మానికి కావల్సిన తేమను అందించి చర్మం సురక్షితంగా, ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. వీటిల్లో విటమిన్లు ఎ, సి సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఎల్లప్పుడూ యవ్వనంగా కనిపించాలంటే వీటిని తరచూ తింటుండాలి. అదేవిధంగా ద్రాక్ష పండ్లను తింటున్నా కూడా చర్మానికి మేలు జరుగుతుంది. ఈ పండ్లలో రెస్వెరెట్రాల్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. చర్మాన్ని సూర్య కిరణాల బారి నుంచి రక్షిస్తుంది. చర్మం ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. ఇలా ఆయా పండ్లను రోజూ తింటుంటే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. కాంతివంతంగా మారి మెరుస్తుంది. వృద్ధాప్య ఛాయలు రాకుండా యవ్వనంగా ఉంటారు.