Foods For Brain Health | మనల్ని ఉత్సాహంగా, చురుగ్గా ఉంచడంలో మెదడు ఎంతో కీలకపాత్ర పోషిస్తుంది. కొందరు ఎల్లప్పుడూ బద్దకంగా ఉంటారు. ఏ పనిచేయలేకపోతుంటారు. ఉత్సాహంగా ఉండరు. నీరసం, అలసట కూడా ఉంటాయి. దీంతో ఎప్పుడూ నిరుత్సాహంగా, ఆసక్తి లేనట్లు కనిపిస్తారు. దీనంతటికీ మెదడు యాక్టివ్‌గా లేకపోవడమే కారణం అని చెప్పవచ్చు. రోజంతా మనం ఉత్సాహంగా ఉండాలంటే ఉదయమే పలు ఆహారాలను తినాల్సి ఉంటుంది. కొన్ని రకాల ఆహారాలను తీసుకోవడం వల్ల మెదడు ఉత్తేజితమవుతుంది. దీంతో యాక్టివ్‌గా మారుతారు. చురుగ్గా పనిచేస్తారు. అలాగే జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతాయి. ఇక మెదడును యాక్టివ్‌గా ఉంచే ఆ ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
వాల్‌నట్స్‌ను చాలా మంది చూసే ఉంటారు. ఇవి అచ్చం మెదడు ఆకారంలోనే ఉంటాయి. ఇందుకు తగినట్లుగానే ఇవి మెదడు ఆరోగ్యాన్ని పరిరక్షిస్తాయి. కనుక వాల్ నట్స్‌ను రోజువారి ఆహారంలో భాగం చేసుకుంటే మెదడును ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. వాల్ నట్స్‌లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఇ సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. వాపుల నుంచి ఉపశమనం అందిస్తాయి. దీంతో మెదడు యాక్టివ్‌గా మారుతుంది. ఉత్సాహంగా పనిచేస్తారు. చురుగ్గా ఉంటారు. జ్ఞాపకశక్తి సైతం పెరుగుతుంది. కాబట్టి రోజూ వాల్ నట్స్‌ను తింటుండాలి.
పసుపు కూడా మనల్ని యాక్టివ్‌గా ఉంచడంలో ఎంతగానో సహాయ పడుతుంది. ఇందులో కర్క్యుమిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలను కలిగి ఉంటుంది. అందువల్ల పసుపును ఆహారంలో భాగం చేసుకుంటే డిప్రెషన్, ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతాయి. మెదడు యాక్టివ్‌గా పనిచేస్తుంది. చురుగ్గా, ఉత్సాహంగా ఉంటారు. రాత్రిపూట పాలలో పసుపు కలుపుకుని తాగితే ఎంతగానో ప్రయోజనం ఉంటుంది.
నారింజ పండ్లలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్ గుణాలను కలిగి ఉంటుంది. అందువల్ల ఫ్రీ ర్యాడికల్స్ వల్ల కలిగే నష్టం నివారించబడుతుంది. విటమిన్ సి న్యూరో ట్రాన్స్మిటర్లను యాక్టివేట్ చేయడంలో ఎంతగానో సహాయ పడుతుంది. దీంతో మూడ్ మారుతుంది. ఉత్సాహంగా ఉంటారు. మెదడు యాక్టివ్‌గా పనిచేస్తుంది. బద్దకం పోతుంది. కాబట్టి ఈ సమస్యలు ఉన్నవారు నారింజ పండ్లను తింటుంటే ప్రయోజనం ఉంటుంది. అలాగే బ్రోకలిని కూడా ఆహారంలో భాగం చేసుకోవచ్చు. ఇందులో విటమిన్ కె ఉంటుంది. ఇది మెదడును ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయ పడుతుంది. బ్రోకలిలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఫ్రీ ర్యాడికల్స్ బారి నుంచి మెదడు కణాలను రక్షిస్తాయి. దీంతో ఆక్సీకరణ ఒత్తిడి తగ్గుతుంది. దీని వల్ల మెదడు యాక్టివ్‌గా మారుతుంది. ఉత్సాహంగా ఉంటారు. ఇలా పలు రకాల ఆహారాలను తీసుకోవడం వల్ల మెదడును యాక్టివ్‌గా ఉంచుకోవచ్చు. చురుగ్గా పనిచేస్తారు. రోజంతా శక్తివంతంగా ఉంటారు. బద్దకం పోతుంది. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతాయి.