Hair fall | జుట్టు ఎక్కువగా రాలిపోతుందా? బట్టతల రాకూడదంటే ఈ జాగ్రత్తలు పాటించండి!
Hair Fall: ఈ రోజుల్లో చాలామందిని వేధిస్తున్న సమస్య జుట్టు రాలిపోవడం ( Hair Fall )! కళ్లముందే జట్టు రాలిపోయి బట్టతల ( bald head )వస్తుంటే ఎంతగానో బాధిస్తుంది. ముఖ్యంగా చిన్నవయసులోనే బట్టతల రావడం మానసికంగా మరింత కుంగదీస్తుంది.
Hair Fall: ఈ రోజుల్లో చాలామందిని వేధిస్తున్న సమస్య జుట్టు రాలిపోవడం ( Hair Fall )! కళ్లముందే జట్టు రాలిపోయి బట్టతల ( bald head )వస్తుంటే ఎంతగానో బాధిస్తుంది. ముఖ్యంగా చిన్నవయసులోనే బట్టతల రావడం మానసికంగా మరింత కుంగదీస్తుంది. అందుకే చాలామంది జుట్టు రాలిపోకుండా ఉండేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. మరి అసలు బట్టతల ( Baldness ) ఎందుకు వస్తుంది? జుట్టు రాలిపోవడం ఆగాలంటే ఏం చేయాలి? ఒకసారి ఇప్పుడు తెలుసుకుందాం..
బట్టతల ( Baldness ) ఎందుకు వస్తుంది?
మానవ జన్యువుల్లోని బాల్డ్నెస్ జీన్స్ ఆండ్రోజెనిటిక్ అలోపిసియా కారణంగా బట్టతల వస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మనం ఎదుర్కొనే ఒత్తిళ్లు, పోషకాహార లోపం కారణంగా కూడా వెంట్రుకలు రాలిపోయి బట్టతల వచ్చే అవకాశం ఉంది. ఇక మహిళల్లో మెనోపాజ్, గర్భధారణ తదితర సమయాల్లో హార్మోన్ల విడుదలలో వచ్చే మార్పు వల్ల కూడా వెంట్రుకలు రాలిపోతుంటాయి. పురుషుల్లో అయినా.. మహిళల్లో అయినా గుండె వ్యాధులు, బీపీ, షుగర్, ఆర్థరైటిస్ వంటి వ్యాధులకు వాడే మందుల వల్ల కూడా జుట్టు ఊడిపోతుంటుంది.
జుట్టు రాలడం ఆపాలంటే ఏం చేయాలి?
నిజానికి బట్టతలను అడ్డుకోవడం చాలా కష్టం. కాకపోతే బట్టతల రావడాన్ని కాస్త జాప్యం చేయవచ్చని పరిశోధనలు చెబుతున్నాయి. జన్యు సంబంధిత, ఇతరత్రా కారణాలతో వచ్చే బట్టతలను పూర్తిగా ఆపలేకున్నా.. కొన్నేండ్ల పాటు బట్టతల రాకుండా జాప్యం చేయవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మరి అది ఎలాగో ఒకసారి చూద్దాం..
➢ పోషకాహారం లోపం వల్ల కూడా జుట్టు రాలిపోతుంది. కాబట్టి ఆరోగ్యకరమైన లైఫ్‌స్టైల్‌ను అలవరచుకోవాలి. ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. అలాగే కంటినిండా కునుకు, తగినంత వ్యాయామం చేయడం కూడా అవసరమే. మద్యపానం, ధూమపానానికి దూరంగా ఉండాలి.
➢ బయటకు వెళ్లినప్పుడు, పొల్యూషన్లో తిరిగినప్పుడు తలను స్కార్ఫ్ లేదా క్యాప్ సాయంతో కవర్ చేసుకోవాలి. తలపై ఎప్పటికప్పుడు పేరుకుపోయిన దుమ్ము వల్ల చుండ్రు తయారవుతుంది. అందువల్ల రెగ్యులర్‌గా షాంపూతో తలను శుభ్రం చేసుకోవాలి. మగవారు అయితే రోజు విడిచి రోజు, మహిళలు అయితే వారానికి రెండు లేదా మూడు సార్లు తలస్నానం చేయాలి.
➢ తల జిడ్డుగా తయారవుతుందని చాలామంది నూనె పెట్టుకోరు. కానీ జుట్టుకు తేమ అందడం చాలా ముఖ్యం. కాబట్టి తలస్నానం చేసే ముందు రోజు జుట్టుకు నూనె పెట్టుకుని మసాజ్ చేసుకుంటే కేశాలు ఆరోగ్యంగా ఉంటాయి.
➢ షాంపూలు, కండీషనర్లను ఏవి పడితే అవి వాడకూడదు. తల మరీ జిడ్డుగా ఉన్నప్పుడు తప్ప ఎక్కువ రసాయనాలు ఉండే షాంపులు, కండీషనర్లను వినియోగించవద్దు. ఆయిలీ ఫ్రీ, మైల్డ్ షాంపూలను వాడాలి. వెంట్రుకలు డ్రైగా ఉంటే మాయిశ్చరైజింగ్ షాంపూలతో తలస్నానం చేయడం మంచిది.
➢ తలస్నానం చేశాక చిక్కులు తీయడానికి ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో దువ్వెనతో బలంగా జుట్టును లాగుతుంటారు. దీనివల్ల కుదుళ్లు చెడిపోయి బలహీనంగా మారుతాయి. తద్వారా జుట్టు రాలే సమస్య పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
➢ హెయిర్ స్టైలిషింగ్ కోసం చాలామంది హెయిర్ డ్రయ్యర్లు, కర్లర్స్ వాడుతుంటారు. అయితే వీటిని ఎక్కువగా వినియోగిస్తే జుట్టు చిట్లిపోతుంది. గడ్డిలా మారి రాలిపోతుంది.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kavya Maran Marriage | కేటీఆర్‌కు కళానిధి మారన్ దంపతుల ఆహ్వానం.. కావ్య మారన్ వివాహ రిసెప్షన్‌కు రావాలని పిలుపు!
Bathukamma Celebrations | ఎతుబార్పల్లిలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు..
KTR | స్వదేశీ మొబిలిటీ ప్లాట్‌ఫామ్ ‘రుటూర్’ ప్రారంభం.. డ్రైవర్లకు కమీషన్ లేని సేవలే లక్ష్యం!
JCJ Results | మూడు రోజుల వ్యవధిలోనే రెండు కొలువులు.. జూనియర్ సివిల్ జడ్జిగా పెద్దపల్లి యువతి హారిక..!
హస్తినలో పరిమళించిన తెలంగాణ పూల పండుగ.. తెలంగాణ భవన్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

