గురువారం 09 జూలై 2020
Health - Jun 06, 2020 , 13:35:00

ఆకలిగా లేదని పిల్లలు మారం చేస్తున్నారా? అయితే ఇలా చేయండి!

ఆకలిగా లేదని పిల్లలు మారం చేస్తున్నారా? అయితే ఇలా చేయండి!

చాలామంది పిల్లలు ఆహారం తినడానికి ఆసక్తి చూపరు. దీంతో బలహీనంగా, బక్కపలుచగా ఉంటారు. తల్లులు ఎన్ని ప్రయత్నాలు చేసినా పిల్లలు ఆహారం మాత్రం తినరు. చిప్స్, చాక్లెట్స్, బిస్కెట్స్ మాత్రం వద్దన్నా తింటుంటారు. సహజంగా పిల్లల ఆకలిని పెంచడం ఎలాగంటే..

* పిల్లలను చిరుతిండ్లకు దూరంగా ఉంచాలి. వీటికి బదులుగా ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్‌లను డైరెక్ట్‌గా కాకుండా వాటికి నీరు, పాలు, వెన్న కలిపి ఇవ్వడం వల్ల ఇష్టంగా తింటారు. ఫ్రూట్ జ్యూస్‌లను ఇష్టపడని పిల్లలకు ఆపిల్, బనానా, జామ, సపోటా పండ్లను చిన్న ముక్కలుగా కోసి ఇస్తే ఇష్టంగా తింటారు.

* చాలామంది తల్లిదండ్రులు పిల్లలకు పోషకాహారం అందించాలనుకుంటారు. కానీ ఆ పోషక పదార్థాలు మాత్రం తెలియవు. వాల్‌నట్స్, డ్రైఫ్రూట్స్, ఎగ్, వెన్న రాసిన చపాతీలు, బాదాం పప్పు, నువ్వులతో చేసిన ఆహార పదార్థాలు పిల్లలకు తినిపించడం వల్ల ఆకలి పెరుగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది.

* పావుకిలో బియ్యం, ఇరవై గ్రాముల శొంఠి, రెండు గ్రాముల మిరియాలు తీసుకొని బాగా గ్రైండ్ చేయాలి. ఒక బాక్స్‌లో దీన్ని నిల్వ ఉంచుకోవాలి. దీన్ని ప్రతిరోజు ఒక స్పూన్ ఒక గ్లాస్ నీటిలో కలిపి ముద్దలుగా అయ్యేలా ఉడికించాలి. దీనికి కాస్త ఆవు నెయ్యి కలిపి ముద్దలుగా చేసుకోవాలి. ఇది రోజూ చెంచాడు చొప్పున తినిపిస్తే ఆకలి పెరుగుతుంది.

* ఆకలి మందగించిన పిల్లలకు అరటిపండును బాగా గుజ్జుగా చేసుకొని తినిపించవచ్చు. లేదా అందులో కాస్త పాలు, కొంచెం చక్కెర కలిపి తినిపించవచ్చు. ఇలా చేస్తే ఆకలి కూడా పెరుగుతుంది. పోషకాలు అందుతాయి.


logo