Warts | పులిపిరి కాయలు అనేవి సహజంగానే చాలా మందిలో వస్తుంటాయి. ఇవి వచ్చేందుకు అనేక కారణాలు ఉంటాయి. కొందరికి పుట్టుకతో ఇవి వస్తాయి. ఇంకా కొందరికి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, జన్యు పరమైన కారణాలు, దీర్ఘకాలంగా మందులను వాడడం వంటి కారణా వల్ల వస్తాయి. అయితే పులిపిర్లను తగ్గించేందుకు తగ్గించుకునేందుకు పలు ఇంటి చిట్కాలను పాటించవచ్చు. వీటితో చాలా సురక్షితంగా పులిపిర్లను తొలగించుకోవచ్చు. కొందరికి పులిపిర్లు దురద కూడా పెడుతుంటాయి. అలాంటి వారు ఈ చిట్కాలను పాటిస్తే పులిపిర్లను సులభంగా తగ్గించుకోవచ్చు. అందుకు ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. పుల్లిపిర్లను తగ్గించేందుకు యాపిల్ సైడర్ వెనిగర్ బాగా పనిచేస్తుంది. ఇందులో సాలిసిలిక్ యాసిడ్ ఉంటుంది. ఇది పులిపిర్లను తగ్గిస్తుంది. యాపిల్ సైడర్ వెనిగర్‌ను కొద్దిగా తీసుకుని నీటిలో వేసి కలిపి ఆ మిశ్రమాన్ని పులిపిర్లు ఉన్న చోట రాయాలి. దానిపై గట్టిగా బ్యాండేజ్ వేయాలి. రాత్రి పూట ఇలా చేయాలి. మరుసటి ఉదయం తీసేయాలి. ఇలా చేస్తుంటే పులిపిర్లు రాలిపోతాయి.
వెల్లుల్లిలోనూ పులిపిర్లను తగ్గించుకోవచ్చు. అందుకు ఏం చేయాలంటే.. వెల్లుల్లి రెబ్బలను దంచి ఆ మిశ్రమాన్ని పులిపిర్లపై వేసి బ్యాండేజ్ అంటించాలి. రాత్రి పూట ఇలా చేసి ఉదయాన్నే తీసేయాలి. ఇలా చేస్తున్నా కూడా పులిపిర్లు తగ్గిపోతాయి. వెల్లుల్లిలో ఆలియం సటివం అనే సమ్మేళనం ఉంటుంది. ఇది యాంటీ వైరల్ గుణాలను కలిగి ఉంటుంది. అందువల్ల పులిపిర్లను తగ్గిస్తుంది. అలాగే అరటి పండు తొక్క లోపలి భాగాన్ని రోజూ కొద్ది సేపు పులిపిర్లపై రుద్దుతుండాలి. ఇలా చేస్తున్నా కూడా పులిపిర్లను తగ్గించుకోవచ్చు. టీ ట్రీ ఆయిల్లో కొద్దిగా కొబ్బరినూనె లేదా బాదంనూనె కలిపి రాత్రి పూట పులిపిర్లపై రాయాలి. మరుసటి రోజు ఉదయం కడిగేయాలి. ఇలా చేస్తుంటే పులిపిర్లను తొలగించుకోవచ్చు. టీ ట్రీ ఆయిల్లో యాంటీ సెప్టిక్ గుణాలు ఉంటాయి. ఇవి అనేక చర్మ సమస్యలను తగ్గిస్తాయి.
చర్మాన్ని సంరక్షించడంలో కలబంద గుజ్జు కూడా బాగానే పనిచేస్తుంది. రాత్రి పూట నిద్రకు ముందు కలబంద గుజ్జును పులిపిర్లపై కొద్దిగా రాసి దానిపై బ్యాండేజ్ అతికించాలి. మరుసటి రోజు ఉదయం తీసేయాలి. ఇలా చేస్తున్నా కూడా ఫలితం ఉంటుంది. అయితే అలొవెరా కొందరిలో చర్మ సమస్యలను కలగజేస్తుంది. దీన్ని వాడితే చర్మంపై దురదలు, దద్దుర్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. కనుక ముందుగా ప్యాచ్ టెస్ట్ చేసి దీన్ని వాడితే మంచిది. విటమిన్ సి ట్యాబ్లెట్లను ఉపయోగించి కూడా పులిపిర్లను తొలగించుకోవచ్చు. అందుకు ఏం చేయాలంటే.. విటమిన్ సి ట్యాబ్లెట్లను పొడిగా చేసి నీళ్లతో కలిపి పేస్ట్‌లా చేయాలి. దీన్ని రాత్రి పూట పులిపిర్లపై రాయాలి. బ్యాండేజ్ అంటించాలి. మరుసటి రోజు ఉదయం తీసేయాలి. దీంతో పులిపిర్లు తొలగిపోతాయి.
ఆముదంలో యాంటీ మైక్రోబియల్ గుణాలు ఉంటాయి. ఇవి పులిపిర్లను తగ్గిస్తాయి. రాత్రి నిద్రకు ముందు ఆముదాన్ని రాస్తున్నా కూడా ప్రయోజనం ఉంటుంది. అయితే పులిపిర్లు తగ్గేందుకు అందరిలోనూ భిన్న సమయం పట్టే అవకాశాలు ఉంటాయి. కొందరికి వారంలో తగ్గిపోతే కొందరికి నెల పట్టవచ్చు. అంతకు మించినా కూడా ప్రయోజనం లేకపోతే డాక్టర్‌ను సంప్రదించడం మంచిది. పులిపిర్లతో వాస్తవానికి మనకు ఎలాంటి హాని ఉండకపోయినా కొందరికి మెడపై ఇవి అంద విహీనంగా కనిపిస్తాయి. కచ్చితంగా తొలగించుకోవాలి అనుకునే వారు డాక్టర్ సలహాను పాటిస్తే మంచిది.