ఫోలేట్.. తీసుకుంటున్నారా?
ఫోలేట్‌ను విటమిన్ బి9 అని కూడా పిలుస్తారు. రోజువారీ పనులు, గర్భిణిగా ఉన్న సమయంలో పిండం అభివృద్ధిచెందడంలో, తల్లి రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయులు తగినమోతాదులో ఉండటంలో ఫోలేట్ కీలకపాత్ర పోషిస్తుంది.
ఫోలేట్‌ను విటమిన్ బి9 అని కూడా పిలుస్తారు. రోజువారీ పనులు, గర్భిణిగా ఉన్న సమయంలో పిండం అభివృద్ధిచెందడంలో, తల్లి రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయులు తగినమోతాదులో ఉండటంలో ఫోలేట్ కీలకపాత్ర పోషిస్తుంది. ఇది తక్కువగా ఉంటే నాడులకు సంబంధించిన రుగ్మతలు వస్తాయి. మెదడు పనితీరు మందగిస్తుంది. ఫోలేట్ వివిధ ఆహార పదార్థాల నుంచి సహజంగానే లభిస్తుంది. ఇక విటమిన్ సప్లిమెంట్లు, ఫోర్టిఫైడ్ ఆహారాల్లో మాత్రం దీన్ని ఫోలిక్ యాసిడ్ రూపంలో జతచేస్తారు. అయితే, సహజమైన ఫోలేట్లా కృత్రిమ ఫోలిక్ యాసిడ్ శరీరంలో కలిసిపోదని కొందరి అభిప్రాయం.
కాబట్టి మనం తినే ఆహారంలోనే ఫోలేట్ ఎక్కువగా ఉన్నవాటిని ఎంచుకోవడం మంచిది. పాలకూర, తోటకూర, అవకాడో, పచ్చిబటాణీలు, బ్రసెల్స్ స్ప్రౌట్స్, బ్రకోలి, ఆవకూర, టమాటాలు, నారింజ, పల్లీలు, అంగూర్లు, పొప్పడి, అరటి పండ్లు, పచ్చసొనతో కూడిన గుడ్లు, జంతు మాంసంలో తినదగిన అవయవాలు (ఆర్గాన్ మీట్స్) మొదలైన వాటిలో ఫోలేట్ దొరుకుతుంది. అయితే సేంద్రియమైనవి, హానికరమైన పురుగుమందుల అవశేషాలు లేని పదార్థాలు ఎంచుకోవాల్సి ఉంటుంది.
ప్రయోజనాలు
- ఎర్రరక్త కణాల ఉత్పత్తిని మెరుగుపరిచి రక్తహీనత ముప్పును తప్పిస్తుంది.
- శరీరంలో హోమోసిస్టయిన్ స్థాయులను నియంత్రించి ఫోలేట్ గుండె ఆరోగ్యానికి అండగా నిలుస్తుంది.
- నోటి ఆరోగ్యంలోనూ ఫోలేట్ది కీలకపాత్ర. ఆహారంలో ఫోలేట్ తగిన మోతాదులో లేకుంటే… నోట్లో అల్సర్లు ఏర్పడతాయి. ఆరోగ్యవంతమైన దంతాలకు, పండ్లకు ఫోలేట్ అత్యవసరం.
- ఫోలేట్ తగినంతగా తీసుకున్నప్పటికీ మన శరీర సంక్షేమంలో ఆరోగ్యకరమైన జీవనశైలి ప్రధానమనే విషయం మర్చిపోకూడదు.
- ఫోలేట్ అనేకాదు ఏ విటమిన్ సప్లిమెంట్లు తీసుకోవాలన్నా డాక్టర్ల సిఫారసు మేరకే అని
గుర్తుంచుకోవాలి.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పోలీస్ అమరుల త్యాగాలను స్మరిస్తూ నల్లగొండలో భారీ బైక్ ర్యాలీ
Naga Chaitanya | నాగచైతన్య కెరీర్లోనే భారీ డీల్.. రూ.45 కోట్లకు ‘వృషకర్మ’ హక్కులు?
Vijay Deverakonda | విజయ్ దేవరకొండ ‘రణబాలి’ నుంచి ‘కోబలి’ వీడియో సాంగ్ విడుదల.!
Varanasi | ‘వారణాసి’లో తండ్రీకొడుకుల ఎమోషన్స్.. మహేశ్ బాబు సినిమా కథపై రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు!
ప్రభుత్వ అసమర్దత వల్లే పంటలు ఎండుతున్నాయి : మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

