Health Tips | ఈ టీలతో ఒత్తిడి, అలసట మటుమాయం
ఎంత అలసటకు లోనైనా, చికాకుతో విసిగి వేసారినా రెండు గుటకల తేనీటిని ఆస్వాదిస్తే మూడ్ ఆహ్లాదంగా (Health Tips) మారుతుంది. శరీరానికి, మెదడుకు టీ ఉత్తేజం ఇవ్వడమే కాకుండా ప్రశాంతతనూ చేకూరుస్తుందని పరిశోధకులు చెబుతున్నారు.
న్యూఢిల్లీ : ఎంత అలసటకు లోనైనా, చికాకుతో విసిగి వేసారినా రెండు గుటకల తేనీటిని ఆస్వాదిస్తే మూడ్ ఆహ్లాదంగా (Health Tips) మారుతుంది. శరీరానికి, మెదడుకు టీ ఉత్తేజం ఇవ్వడమే కాకుండా ప్రశాంతతనూ చేకూరుస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. వర్షాకాలంలో టీని ఆస్వాదించడాన్ని అందరూ ఇష్టపడుతుంటారు. మూడ్‌కు తగిన విధంగా భిన్నమైన టీలు అందుబాటులో ఉన్నాయి. ఇవి శరీరానికి చురుకుదనంతో పాటు మానసిక ప్రశాంతతనూ చేకూరుస్తాయి.
ప్రాచీన కాలం నుంచి మన సంస్కృతితో మమేకమైన తులసి టీతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. తులసి టీ మరింత రుచిగా ఉండాలంటే అల్లం కూడా జోడించవచ్చు. చామంతి టీ మనసును, మూడ్‌ను ఆహ్లాదంగా, ప్రశాంతంగా ఉంచుతుంది. కంటినిండా కునుకు తీసేందుకు, ఒత్తిడిని చిత్తుచేసేందుకు ఈ టీ ఎంతో ఉపయోగకరం.
ఇక బరువు తగ్గేవారు కోరుకునే గ్రీన్ టీ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. గ్రీన్‌టీతో రోజంతా పనిచేసిన అలసట ఇట్టే మటుమాయమై ఇన్స్టంట్ రిలీఫ్‌ను ఇస్తుంది. ఈ టీ శరీరంలోని వ్యర్ధాలను తొలగిస్తుంది. ఇక పుదీనా టీలో వాపు ప్రక్రియను నివారించే ఔషధాలు ఉండటంతో ఇది మనల్ని ప్రశాంతంగా, తాజాగా ఉంచడంతో పాటు మింట్‌లో ఉండే ఔషధాలు మూడ్ స్వింగ్స్‌ను నివారిస్తాయి. శరీరానికి అవసరమైన శక్తిని ఇచ్చి స్ట్రెస్‌ను దూరం చేసే బ్లాక్ టీని ఆస్వాదించాలి. బ్లాక్ టీతో శరీరానికి అవసరమైన తక్షణ శక్తి లభిస్తుంది.
Read More :
US Ambulance: అంబులెన్స్‌ను ఎత్తుకెళ్లి.. హైవేపై దూసుకెళ్లుతూ.. 13 కార్లను ఢీకొట్టాడు.. వీడియో
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

