Health Tips | నిద్రలేమితో హైబీపీ ముప్పు
Health Tips | రోజుకు ఏడు గంటల కన్నా తక్కువ నిద్రిస్తే క్రమంగా అధిక రక్తపోటుకు దారితీసే ముప్పు పొంచిఉందని తాజా అధ్యయనం వెల్లడించింది.
Health Tips | రోజుకు ఏడు గంటల కన్నా తక్కువ నిద్రిస్తే క్రమంగా అధిక రక్తపోటుకు దారితీసే ముప్పు పొంచిఉందని తాజా అధ్యయనం వెల్లడించింది. అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ వార్షిక శాస్త్రీయ సెషన్లో పరిశోధకులు తమ నివేదికను సమర్పించారు. 2000 జనవరి నుంచి 2023 మే మధ్య చేపట్టిన 16 అధ్యయనాల గణాంకాలను విశ్లేషించి ఈ వివరాలను నిగ్గుతేల్చారు.
గతంలో హైబీపీ నేపధ్యంలేని ఆరు దేశాలకు చెందిన 10,44,035 మందిలో హైపర్‌టెన్షన్‌ను గుర్తించారు. వయసు, లింగబేధం, విద్యార్హతలు, బీఎంఐ, స్మోకింగ్ వంటి అంశాలతో సంబంధం లేకుండా నిద్రలేమి బీపీకి కారణమవుతుందని ఈ అధ్యయనంలో కనుగొన్నారు. రోజుకు ఐదు గంటల కన్నా తక్కువ నిద్రించే వారిలో బీపీ ముప్పు 11 శాతం అధికంగా ఉండగా, రోజుకు ఏడు గంటల కన్నా తక్కువ నిద్రపోయేవారిలో బీపీ ముప్పు 7 శాతం పెరిగినట్టు పరిశోధకులు గుర్తించారు.
రోజుకు ఏడు నుంచి ఎనిమిది గంటల నిద్ర అవసరమని నిపుణులు సూచిస్తున్నారని, ఇలా చేయడం మీ గుండెకు కూడా మేలు చేస్తుందని అధ్యయన పరిశోధకులు, ఇరాన్‌లోని టెహ్రాన్ హార్ట్ సెంటర్ కార్డియాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ కవే హొసెని చెప్పారు. మధుమేహం, స్మోకింగ్ అలవాటున్న వారిలో మధుమేహ ముప్పు 20 శాఈతం అధికమని వివరించారు.
Read More :
Dilip Ghosh | దీదీపై అభ్యంతరకర వ్యాఖ్యలు.. బీజేపీ ఎంపీ దిలీప్ ఘోష్‌పై కేసు నమోదు
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

