ఫైబ్రాయిడ్స్.. ఆందోళన వద్దు!
ఫైబ్రాయిడ్స్.. మహిళలు ఎదుర్కొనే పలు ఆరోగ్య సమస్యల్లో ఇవీ ఒకటి. గర్భసంచిలో గడ్డల్లా పెరిగే ఈ ఫైబ్రాయిడ్స్.. పెద్దగా హానికరం కాకపోయినా, బాధితులను తీవ్ర ఇబ్బంది పెడుతాయి. అయితే, ఈ గడ్డలు క్యాన్సర్‌గా మారతాయేమోనని కొందరు ఆందోళన చెందుతుంటారు.
ఫైబ్రాయిడ్స్.. మహిళలు ఎదుర్కొనే పలు ఆరోగ్య సమస్యల్లో ఇవీ ఒకటి. గర్భసంచిలో గడ్డల్లా పెరిగే ఈ ఫైబ్రాయిడ్స్.. పెద్దగా హానికరం కాకపోయినా, బాధితులను తీవ్ర ఇబ్బంది పెడుతాయి. అయితే, ఈ గడ్డలు క్యాన్సర్‌గా మారతాయేమోనని కొందరు ఆందోళన చెందుతుంటారు. కానీ, ఇవి క్యాన్సర్‌గా మారవు. చాలా అరుదుగా మాత్రం.. కొందరిలో లియోమయోసార్కోమా అనే క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. అందుకే.. ఫైబ్రాయిడ్స్ గురించి ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఫైబ్రాయిడ్స్ గడ్డలు గర్భసంచిలో వేర్వేరు పరిమాణాల్లో (సైజుల్లో) పెరుగుతాయి. ఇలా పెరగడం ఎంత సాధారణం అంటే.. ప్రతి నలుగురిలో, ఒకరు ఫైబ్రాయిడ్స్ బాధితులు ఉంటారు. ఫైబ్రాయిడ్స్‌ను వైద్య పరిభాషలో యుటెరైన్ మయోమాస్, ఫైబ్రోమయోమాస్, లియోమయోమాస్ అని పిలుస్తారు. ఎలాంటి చికిత్స తీసుకోక పోయినా.. ఇవి మెల్లమెల్లగా తగ్గిపోతాయి. సాధారణంగా 30 ఏళ్ల నుంచి 50 ఏళ్ల మధ్యలో ఉన్నవారిలో ఫైబ్రాయిడ్స్ ఎక్కువగా కనిపిస్తాయి. ఇవి వేర్వేరు పరిమాణాల్లో ఉంటాయి.
ఫైబ్రాయిడ్స్ రకాలు
ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్, సబ్సిరోస్ ఫైబ్రాయిడ్స్, సబ్ మ్యూకస్ ఫైబ్రాయిడ్స్, పెడంక్యులేటెడ్ ఫైబ్రాయిడ్స్.. అని గర్భసంచిలో గడ్డలు వచ్చిన భాగాన్ని బట్టి, వీటికి పేర్లు ఉంటాయి.
కారణాలు : ఫైబ్రాయిడ్స్ ఎందుకు వస్తాయన్న దానికి పెద్దగా కారణాలు తెలియదు. అయితే శరీరంలో ఈస్ట్రోజెన్ హార్మోన్ మోతాదులు పెరిగినప్పుడు.. అదే హార్మోన్, ఫైబ్రాయిడ్స్ పెరుగుదలకూ కారణం అవుతుందని వైద్యులు గుర్తించారు. ఈస్ట్రోజెన్ సరఫరా తగ్గితే.. ఇవి కూడా క్రమంగా కుంచించుకు పోతాయని తేల్చారు.
లక్షణాలు : ప్రతి ముగ్గురు ఫైబ్రాయిడ్స్ బాధితుల్లో ఒకరిలో మాత్రమే లక్షణాలు కనిపిస్తాయి. కొందరిలో ఈ సమస్య ఉన్నప్పటికీ, అవి ఉన్న విషయమే తెలియదు. అందుకే చాలామందిలో ఇతర సమస్యల కోసం పరీక్షలు చేస్తుంటే.. ఫైబ్రాయిడ్స్ బయటపడతాయి.
సాధారణ లక్షణాలు
- రుతుస్రావం సమయంలో తీవ్రమైన రక్తస్రావం, నొప్పి
- కలయిక సమయంలో నొప్పి
- గర్భస్రావం లేదా గర్భధారణ జరగకపోవడం
- గర్భిణిగా ఉన్న సమయంలో సమస్యలు.
- మల విసర్జన సాఫీగా కాకపోవడం, మూత్ర విసర్జన కూడా ఆగుతూ ఆగుతూ రావడం.
- కొందరిలో రక్తహీనత కూడా ఎక్కువగా కనిపిస్తుంది.
పరీక్షలు : యోనిని పరీక్షించినప్పుడు డాక్టర్ల చేతికి ఫైబ్రాయిడ్స్ గడ్డలు తగలవచ్చు. మరికొందరిలో అల్ట్రాసౌండ్ స్కానింగ్‌లో ఫైబ్రాయిడ్స్ ఉన్నట్లు తెలియవచ్చు.
చికిత్స : ట్రానెగ్జామిక్ యాసిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ మందులు, కొన్ని గర్భ నిరోధక మాత్రలు మొదలైన చికిత్స విధానాలు చేస్తారు. సాధారణ చికిత్సతో తగ్గనప్పుడు కొన్ని శస్త్రచికిత్స ప్రక్రియలు, ఎండోమెట్రియల్ అబ్లేషన్, యుటెరస్‌కు రక్త సరఫరా చేసే రక్తనాళాన్ని ఆటంకపరచి.. దానికి రక్త సరఫరాను ఆపే ‘యుటెరైన్ ఆర్టరీ ఎంబోలైజేషన్’ వంటి ప్రక్రియలతో చికిత్స అందిస్తారు. నిజానికి ఫైబ్రాయిడ్స్ అనేది.. పెద్దగా ఆందోళన చెందాల్సిన సమస్య కాదు. అందుకే, వీటి గురించి అంతగా బాధపడాల్సిన అవసరం కూడా లేదు.
– డా॥ సరోజ బొంతు సీనియర్ కన్సల్టెంట్
అబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజిస్ట్,
బర్త్‌రైట్ బై రెయిన్బో హాస్పిటల్స్,
ఎల్బీనగర్, హైదరాబాద్
ఫోన్: 8882 046 046
www.rainbowhospital.in
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

