Mental Health | చిన్న చిన్న విషయాలకే టెన్షన్ పడుతున్నారా.. ఈ 7 ట్రిక్స్‌తో యాంగ్జైటీని ఈజీగా తగ్గించుకోవచ్చు!
Mental Health | ప్రస్తుతం వేగంగా మారుతున్న లైఫ్స్టైల్లో చాలామందిని వేధిస్తున్న మానసిక సమస్య ఆందోళన (Anxiety). దీన్ని తగ్గించుకోవడానికి డాక్టర్లే దగ్గరికే వెళ్లాల్సిన అవసరం లేదు. 7 సులభమైన అలవాట్లను మన జీవితంలో భాగం చేసుకుంటే ఈజీగా దాని నుంచి బయటపడవచ్చు.
Mental Health | ప్రస్తుతం వేగంగా మారుతున్న లైఫ్స్టైల్లో చాలామందిని వేధిస్తున్న మానసిక సమస్య ఆందోళన (Anxiety). పని ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు, కుటుంబ కలహాలు, ఒంటరితనం, భవిష్యత్తుపై భయం వంటి అనేక కారణాల వల్ల యువత ఎక్కువగా ఈ మానసిక సమస్య బారిన పడుతున్నారు. దీనివల్ల కొందరిలో చిన్న చిన్న విషయాలకే గుండెదడ, అసహనం, భయం, చిరాకు వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. అయితే దీనికి చికిత్స ఎలా అని పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 7 సులభమైన అలవాట్లను జీవితంలో భాగం చేసుకుంటే యాంగ్జైటీ నుంచి బయటపడవచ్చని సూచిస్తున్నారు.
కారణాన్ని గుర్తించాలి
యాంగ్జైటీ నుంచి బయటపడాలంటే ముందుగా అది ఎందుకు వస్తుందో కారణం తెలుసుకోవాలి. చాలా సందర్భాల్లో మన మనసులో దాగి ఉన్న భయాలు, ఒత్తిడిలే ఆందోళనలకు కారణమవుతాయి. అందుకే ఏకాంతంగా కూర్చుని, మన అంతరాత్మతో మనమే మాట్లాడుకోవడం ద్వారా, కుటుంబసభ్యులు లేదా స్నేహితులతో చర్చించడం ద్వారా యాంగ్జైటీ ఎందుకు వస్తుందో తెలుసుకోవచ్చు. కారణం తెలిస్తే సులభంగా దాని పరిష్కారం కనుగొనడం సాధ్యమవుతుంది.
కొత్త అలవాట్లు అలవరచుకోవాలి
రెగ్యులర్‌గా ఒకే విధమైన లైఫ్‌స్టైల్ ఫాలో కావడం వల్ల మానసిక ఒత్తిడి ఎక్కువవుతుంది. అందుకే రోజువారీ పనుల్లో కొత్త అలవాట్లు అలవాటు చేసుకోవాలి. పుస్తకాలు చదవడం, కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం, గార్డెనింగ్, మ్యూజిక్ వినడం వంటి పనులు చేయడం ద్వారా మనసును బిజీగా ఉంచితే.. ఆందోళన ఆటోమేటిగ్గా దూరమవుతుంది.
సన్నిహితులతో మాట్లాడాలి
యాంగ్జైటీ ఉన్నవారు చాలాసార్లు ఇతరుల నుంచి దూరంగా ఒంటరిగా ఉండాలని భావిస్తారు. దీనివల్ల సమస్య దూరం కాకపోగా.. మరింత పెరుగుతుంది. కాబట్టి కుటుంబసభ్యులు, స్నేహితులు, సహోద్యోగులతో మనసు విప్పి మాట్లాడాలి. బాధలను పంచుకోవాలి. అలా ఇతరులతో కలిసిమెలిసి ఉండటం వల్ల ఒత్తిడి తగ్గి మానసిక ప్రశాంతత పెరుగుతుంది.
సెల్ఫ్ కేర్‌కు ప్రాధాన్యమివ్వాలి
ఇతరుల కోసం మాత్రమే ఆలోచిస్తూ చాలామంది తమ అవసరాలను పట్టించుకోరు. అలాంటి వారు తమ కోసం కూడా కొంత సమయాన్ని కేటాయించాలి. ఇష్టమైన పాటలు వినడం, నచ్చిన ఆహారం తినడం, చిన్న విరామాలు తీసుకోవడం, చర్మ సంరక్షణ వంటి పనులు చేస్తే మానసిక ఉల్లాసం పెరుగుతుంది.
డీప్ బ్రీతింగ్
ఆందోళన ఎక్కువైనప్పుడు ప్రశాంతంగా కూర్చొని, గట్టిగా శ్వాస తీసుకోవాలి. ఊపిరి బలంగా పీల్చుకుని, కొన్ని సెకండ్ల పాటు ఆపేయాలి. ఆ తర్వాత మెల్లిగా బయటకు వదలాలి. ఇలా చేయడం వల్ల నాడీ వ్యవస్థ ఉత్తేజితమవుతుంది. గుండె వేగం కూడా నియంత్రణలోకి వస్తుంది.
ధ్యానం అలవాటు చేసుకోవాలి
ప్రతిరోజూ కొన్ని నిమిషాల పాటు ధ్యానం చేయడం వల్ల మానసిక ఒత్తిడి, ఆందోళన, ఆలోచనల భారం తగ్గుతుంది. ధ్యానం మనసును ప్రశాంతంగా మార్చుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. ఇలా రోజూ చేయడం వల్ల దీర్ఘకాలంలో మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది.
వ్యాయామం తప్పనిసరి
వాకింగ్, జాకింగ్, యోగా, డ్యాన్స్, పుష్అప్స్, జంపింగ్ జాక్స్ వంటి వ్యాయామాలు చేయడం వల్ల శరీరంలోని ఎండార్పిన్ అనే హ్యాపీ హార్మోన్ విడుదలవుతుంది. ఇది మనసుకు ఉల్లాసాన్ని అందించి ఆందోళనను తగ్గిస్తుంది. రోజుకు కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చేయడం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం రెండూ మెరుగుపడతాయి.
యాంగ్జైటీ నార్మల్‌గా ఉన్నప్పుడు ఈ ఏడు ట్రిక్స్ ఫాలో అయితే సరిపోతుంది. కానీ ఈ లక్షణాలు తరచూ కనిపిస్తే లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసే స్థాయికి చేరుకుంటే మాత్రం మానసిక ఆరోగ్య నిపుణులను సంప్రదించడం మంచిది.
Read More:
Eggs | కోడిగుడ్లను తరచూ తింటున్నారా.. అయితే ఈ విషయాలను తెలుసుకోవడం తప్పనిసరి..
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

