Health Tips : వైన్‌తో ఈ సైడ్ఎఫెక్ట్స్ తప్పవంటున్న వైద్య నిపుణులు!
Health Tips : రోజుకు రెండు మూడు గ్లాసుల వైన్ గుండె ఆరోగ్యానికి మంచిదని, ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లతో ఆరోగ్యానికి మేలు కలుగుతుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.

Health Tips : రోజుకు రెండు మూడు గ్లాసుల వైన్ గుండె ఆరోగ్యానికి మంచిదని, ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లతో ఆరోగ్యానికి మేలు కలుగుతుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. వైన్‌తో దీర్ఘాయువూ సొంతమవుతుందని కొందరు చెబుతున్నా మద్యంతో ఆరోగ్యానికి ముప్పు తప్పదని మరికొందరు వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వైన్‌తో ముంచుకొచ్చే సైడ్ ఎఫెక్ట్స్ గురించీ తెలుసుకోవాలని వారంటున్నారు.
వైన్‌లో ఉండే యాంటీఆక్సిడెంట్లతో క్యాన్సర్ ముప్పు తగ్గుతుందని భావిస్తుంటారు. అయితే అనాల్స్ ఆఫ్ ఎపిడెమాలజీలో ప్రచురితమైన అధ్యయనం రోజుకు ఒకట్రెండు గ్లాసుల వైన్ తీసుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్ ముప్పు 30 నుంచి 50 శాతం పెరుగుతుందని వెల్లడించింది. వైన్‌తో గుండె జబ్బుల ముప్పు అధికమని చెబుతున్నారు.
రోజూ మద్యం తీసుకుంటే గుండె జబ్బుల ముప్పు 16 శాతం పెరుగుతుందని యూరోపియన్ హార్ట్ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం తెలిపింది. కాలేయ సమస్యలు కూడా మద్యంతో అధికమవుతాయి. ఫ్యాటీ లివర్, సిరోసిస్ వంటి వ్యాధుల ముప్పు పెరుగుతుందని యూరోపియన్ అసోసియేషన్ ఫర్ ది స్టడీ ఆఫ్ లివర్‌లో ప్రచురితమైన అధ్యయనం తెలిపింది. మద్యం తీసుకోవడం ద్వారా నిద్రలేమి, కుంగుబాటు కూడా బాధిస్తాయని పేర్కొంది.
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- health tips
- new study
- wine
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

