Health Tips | కొన్నిటిని వేడి చేసుకుని తింటే మంచిది. కొన్నిటిని వేడి చేయకుండా తింటే మంచిది. దేన్నయినా మళ్లీ మళ్లీ వేడి చేస్తే మాత్రం విషంతో సమానం. పోషక విలువలు చచ్చిపోతాయి. మిగిలిపోయిన ఆహారాన్ని ఫ్రిజ్‌లో పెట్టుకుని.. అవసరాన్ని బట్టి వేడి చేసుకోవడం మనకు అలవాటే. కొన్ని వంటల విషయంలో ఈ పద్ధతి సురక్షితం కాదని నిపుణుల హెచ్చరిక.
పోషకాల గని. ప్రొటీన్ అపారంగా లభిస్తుంది. కానీ, రిఫ్రిజిరేటర్లో నిల్వ చేసుకుని.. మళ్లీ మళ్లీ వేడి చేసినప్పుడు అందులోని ప్రొటీన్ రూపాంతరం చెందుతుంది. కొంతమేర ప్రమాదకరంగా మారుతుంది. ఫలితంగా జీర్ణ వ్యవస్థకు ఇబ్బంది కలుగుతుంది.
అప్పుడే వండిన అన్నాన్ని చల్లబరిచి ఫ్రిజ్‌లో పెట్టుకోవచ్చు. మరుసటి రోజు వేడి చేసుకునీ తినొచ్చు. కానీ అంతకంటే ఎక్కువ రోజులు, మరిన్నిసార్లు వేడి చేయడం మంచిది కాదు. బయటి వాతావరణంలో ఉంచినప్పుడు హానికర బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది.
చేపలు, రొయ్యలు మొదలైన సముద్ర ఆహారం.. తాజాగానే రుచికరం. నిల్వ ఉంచితే జిహ్వకు రుచించదు. పోషకాలు కూడా తగ్గిపోతాయి. అతిగా వేడిచేసిన సముద్ర ఆహారం కొందరిలో అలర్జీ కలిగిస్తుంది.
ఫ్రైడ్ ఎగ్, బాయిల్డ్ ఎగ్ పదేపదే వేడిచేయడం మంచిది కాదు. నిల్వ ఉంచిన గుడ్డు వంటకాలను చల్లగా కూడా తినేయవచ్చు. వేడివేడి అన్నంలో కలుపుకొంటే సరిపోతుంది. ఎందుకంటే, హై-ప్రొటీన్ ఫుడ్‌లో నైట్రోజన్ ఎక్కువగా ఉంటుంది. అతిగా వేడిచేయడం వల్ల అది ఆక్సిడైజ్ అవుతుంది. క్యాన్సర్‌కు దారితీస్తుంది.
ఇందులోనూ నైట్రేట్స్ అధికంగా ఉంటాయి. పాలకూర పప్పు, పాలక్ పనీర్, పాలకూర పచ్చడి వేడిచేసిన కొద్దీ నైట్రోసమైన్స్గా మారతాయి. క్యాన్సర్‌కు దారితీస్తాయి.
పచ్చి బీట్రూట్ అమృతంతో సమానం. కాస్త ఉడికించి తిన్నా పోషకాలకు నష్టం వాటిల్లదు. మళ్లీ మళ్లీ వేడిచేసినప్పుడు మాత్రం.. బీట్రూట్ తన సహజ స్వభావాన్ని మార్చుకుంటుంది. టాక్సిన్స్ ఉత్తేజితం అవుతాయి.
మష్రూమ్స్‌ను వండుకునే తినాలి. కానీ, మళ్లీ మళ్లీ వేడిచేయడం మాత్రం సరైన పద్ధతి కాదు. సరైన వాతావరణంలో నిలువ చేయకపోతే మాత్రం.. తినగానే పొట్టలో గడబిడ మొదలవుతుంది.
వేడిచేసుకుని తినకూడని పదార్థం ఆలూ కర్రీ. కాస్త చల్లారగానే దీనిమీద హానికర బ్యాక్టీరియా దాడి చేస్తుంది.