నమ్రతా పురోహిత్ ప్రముఖ ఫిట్నెస్ ట్రైనర్. నటి జాన్వీ కపూర్ శిక్షకురాలు. ఆమె వరల్డ్ ఆఫ్ హెల్త్, ఫిట్నెస్రంగంలో ప్రపంచ ప్రసిద్ధి. నమ్రతా పురోహిత్ సెలెబ్రిటీలకు శిక్షణనివ్వడంతోపాటు నిత్యం తన ఇన్‌స్టాగ్రాంలో ఫాలోవర్స్ కోసం ఫిట్నెస్ సీక్రెట్స్ చెబుతుంది. ఇటీవల ఆమె వెన్నునొప్పిని తగ్గించే వ్యాయామాలకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేయగా, వైరల్‌గా మారింది.
ఈ మధ్యకాలంలో వెన్నెనొప్పి సమస్య చాలామందిని వేధిస్తున్నది. కరోనా మహమ్మారి వల్ల ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం చేశారు. దీంతో కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లకు అతుక్కుపోయారు. శారీరక శ్రమ తక్కువైపోయింది. శరీరాన్ని కదిలించకుండా ఎక్కువసేపు కూర్చుండడంతో అది వెన్నునొప్పికి దారితీస్తుంది. ఈ వెన్నునొప్పికి ఇంట్లోనే ఎలాంటి పరికరాలు లేకుండా ఉపశమనం పొందే వ్యాయామాలను చేసి చూపించారు నమ్రతా పురోహిత్. ‘ఈ వ్యాయామాలు నిజంగా వెన్నెముకకు రిలీఫ్ ఇస్తాయి.. వీటిని ప్రయత్నించండి..మీరు ఎలా ఫీలయ్యారో నాకు తెలియజేయండి.’ అని నమ్రతా ఈ పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చారు.
ఇన్స్టాగ్రామ్ వీడియోలో నమ్రతా చేసిన వ్యాయామాలు ఇవే..