Depression | పిల్లలు పుట్టిన తరువాత తల్లులకే కాదు, తండ్రులకూ డిప్రెషన్.. సైంటిస్టుల అధ్యయనంలో వెల్లడి..
పిల్లలు పుట్టిన తర్వాత తల్లుల్లో మాత్రమే కాదు, తండ్రుల్లో కూడా మానసిక ఆరోగ్య సమస్యలు కనిపిస్తాయని తాజా అధ్యయనం వెల్లడించింది. సాధారణంగా పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్ (postpartum depression) అంటే తల్లులకే సంబంధించిన సమస్యగా భావిస్తారు.
Depression | పిల్లలు పుట్టిన తర్వాత తల్లుల్లో మాత్రమే కాదు, తండ్రుల్లో కూడా మానసిక ఆరోగ్య సమస్యలు కనిపిస్తాయని తాజా అధ్యయనం వెల్లడించింది. సాధారణంగా పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్ (postpartum depression) అంటే తల్లులకే సంబంధించిన సమస్యగా భావిస్తారు. అయితే కొత్త పరిశోధన తండ్రుల్లో ఈ సమస్య వెంటనే కాకుండా ఆలస్యంగా కనిపిస్తుందని పిల్లలు పుట్టిన సుమారు ఒక సంవత్సరం తర్వాత ఎక్కువగా బయటపడుతుందని వెల్లడించిది. JAMA Network Open లో ప్రచురితమైన ఈ అధ్యయనం స్వీడన్‌కు చెందిన 10 లక్షలకుపైగా తండ్రులను పరిశీలించింది. పరిశోధనలో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, గర్భధారణ సమయంలో, పిల్లలు పుట్టిన తర్వాత ప్రారంభ నెలల్లో తండ్రులు సాధారణంగా స్థిరంగా లేదా సంతోషంగా ఉంటారు. కానీ, పిల్లలకు ఏడాది పూర్తయ్యే సమయానికి డిప్రెషన్, ఒత్తిడి సంబంధిత సమస్యలు గణనీయంగా పెరుగుతున్నాయి.
డిలేడ్ ఎఫెక్ట్ అంటే..
ఈ పరిశోధనలో ముఖ్యంగా గుర్తించిన అంశం డిలేడ్ ఎఫెక్ట్. అంటే సమస్య వెంటనే కనిపించకుండా క్రమంగా పెరుగుతూ, ఒక సంవత్సరం తర్వాత తీవ్రంగా బయటపడుతుంది. గర్భధారణకు ముందు పరిస్థితులతో పోలిస్తే, పిల్లలకు ఏడాది వచ్చినప్పటికీ డిప్రెషన్, స్ట్రెస్ సమస్యలు 30 శాతం కన్నా ఎక్కువగా పెరిగినట్టు అధ్యయనం చెబుతోంది. మరొక ముఖ్య కారణం మాస్కింగ్ ఆఫ్ సింప్టమ్స్. చాలా మంది తండ్రులు తమ భావోద్వేగాలను దాచిపెడతారు. ముఖ్యంగా తల్లి ఆరోగ్యాన్ని ప్రాధాన్యంగా భావించి, తమ సమస్యలను పక్కన పెడతారు. దీనివల్ల ప్రారంభ దశలో చికిత్స పొందకుండా, సమస్యలు తీవ్రమయ్యే వరకు బయటపడవు. అలాగే డిలేడ్ వల్నరబిలిటీ కూడా కీలక పాత్ర పోషిస్తుంది. గర్భధారణ సమయంలో తగ్గిన ఆందోళన లేదా ఇతర అలవాట్లు తిరిగి సాధారణ స్థితికి వస్తాయి. అయితే డిప్రెషన్, ఒత్తిడి మాత్రం క్రమంగా పెరుగుతూనే ఉంటాయి. కుటుంబ బాధ్యతలు, ఆర్థిక ఒత్తిడి, నిద్రలేమి వంటి అంశాలు సమయంతో కలిసి మానసిక ఒత్తిడిని పెంచుతాయి.
ప్రతి 10 మందిలో ఒకరికి..
పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్ ఇన్ మేన్ (PPND) అనే ఈ పరిస్థితి సుమారు ప్రతి 10 మంది తండ్రుల్లో ఒకరిని ప్రభావితం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇది సాధారణ బేబీ బ్లూస్ లా తాత్కాలికం కాదు. దీర్ఘకాలికంగా ఉండే తీవ్రమైన మానసిక సమస్యగా మారే ప్రమాదం ఉంది. ఈ సమస్యకు కారణాలు ఒక్కటే కాకుండా పలు అంశాలు కలిసి పనిచేస్తాయి. తండ్రుల్లో కూడా హార్మోన్ మార్పులు జరుగుతాయి. టెస్టోస్టెరోన్ తగ్గడం, కార్టిసోల్, ప్రోలాక్టిన్ వంటి హార్మోన్ల మార్పులు దీనికి కారణం అవుతాయి. అలాగే భార్యకు పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్ ఉంటే, తండ్రికి వచ్చే ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుంది. లక్షణాల విషయానికి వస్తే, తండ్రుల్లో ఇవి సాధారణంగా వేరుగా కనిపిస్తాయి. బాధ, అలసటతో పాటు చిరాకు, కోపం, కుటుంబ సభ్యుల నుండి దూరంగా ఉండడం, ఆలోచించకుండా చేసే ప్రవర్తన వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొందరికి తలనొప్పి, జీర్ణ సమస్యలు వంటి శారీరక లక్షణాలు కూడా ఉంటాయి.
తండ్రుల ఆరోగ్యం కూడా ముఖ్యమే..
ఈ అధ్యయనం ఆరోగ్య వ్యవస్థలో ఉన్న లోటును కూడా బయటపెట్టింది. ప్రస్తుతం తండ్రుల మానసిక ఆరోగ్యంపై పెద్దగా స్క్రీనింగ్ జరగడం లేదు. ఎక్కువగా సహాయం తల్లి మీదే కేంద్రీకృతమై ఉంటుంది. అందువల్ల తండ్రుల సమస్యలు గుర్తించకుండా ఆలస్యంగా బయటపడుతున్నాయి. నిపుణులు చెబుతున్నది ఏమిటంటే తండ్రుల మానసిక ఆరోగ్యాన్ని కనీసం ఒక సంవత్సరం పాటు గమనించడం చాలా అవసరం. ప్రారంభ దశలోనే సమస్యలను గుర్తించి చికిత్స తీసుకుంటే, తండ్రి ఆరోగ్యం మాత్రమే కాకుండా పిల్లల అభివృద్ధిపై కూడా మంచి ప్రభావం ఉంటుందని నిపుణులు తెలియజేస్తున్నారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- Depression
- health tips
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. లాంఛనంగా ప్రారంభించిన ఆర్మీ
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

