Gut Health | ప్రేవుల ఆరోగ్యాన్ని కాపాడే కీలక విటమిన్లు ఇవే..!
మన శరీరం ఆరోగ్యంగా ఉండి మన పనులను మనం సజావుగా చేసుకోవాలంటే ముందుగా ప్రేవుల ఆరోగ్యం (Gut Health) బాగా ఉండేలా చూసుకోవాలి.
న్యూఢిల్లీ : మన శరీరం ఆరోగ్యంగా ఉండి మన పనులను మనం సజావుగా చేసుకోవాలంటే ముందుగా ప్రేవుల ఆరోగ్యం (Gut Health) బాగా ఉండేలా చూసుకోవాలి. మనం తీసుకున్న ఆహారం బాగా జీర్ణం కావడంతో పాటు శరీరం పోషకాలను గ్రహించేందుకు, రోగ నిరోధక వ్యవస్ధ మెరుగయ్యేందుకు ప్రేవులు కీలక పాత్ర పోషిస్తాయి. సమతులాహారం తీసుకుంటూ ఆరోగ్యకర జీవనశైలిని అనుసరించినా, నిర్ధిష్ట విటమిన్లు ప్రేవుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
కంటిచూపు మెరుగయ్యేందుకు, రోగ నిరోధక వ్యవస్ధను ప్రేరేపించేందుకు ఉపకరించే విటమిన్ ఏ ప్రేవుల లైనింగ్ ఆరోగ్యం కాపాడటంలోనూ కీలకంగా పనిచేస్తుంది. లివర్, ఫిష్ ఆయిల్, ఎగ్స్, పండ్లు, క్యారెట్స్, స్వీట్ పొటాటో, పాలకూర వంటి కూరగాయలు, ఆకుకూరల్లో విటమిన్ ఏ లభిస్తుంది. మామిడి పండ్లలోనూ విటమిన్ ఏ ఉంటుంది.
ఇక సన్ఫైన్ విటమిన్‌గా పేరొందిన విటమిన్ డీ ఎముకల ఆరోగ్యానికే కాకుండా ప్రేవుల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇది సూర్యరశ్మితో పాటు ఫోర్టిఫైడ్ డైరీ ఉత్పత్తులు, ఎగ్స్, మష్రూమ్స్‌లో అధికంగా లభిస్తుంది. ఇక ప్రేవుల ఆరోగ్యాన్ని కాపాడటంలో బీ విటమిన్లు ఎంతో మేలు చేస్తాయి. ఇక విటమిన్ బీ1, బీ2, బీ3, బీ6, బీ9, బీ12 విటమిన్లు ప్రేవుల ఆరోగ్యానికి అత్యవసరం. ఇవి శక్తి ఉత్పత్తితో పాటు నరాల పనితీరుపై ప్రభావితం చేస్తాయి. విటమిన్ సీ కూడా ప్రేవుల ఆరోగ్యాన్ని కాపాడటంలో ముందువరుసలో ఉంటుంది.
Read More :
Detox Drink | ఈ డీటాక్స్ డ్రింక్‌తో మెరిసే చర్మం మీ సొంతం..!
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

