న్యూఢిల్లీ : వయసుతో సంబంధం లేకుండా ప్రతిఒక్కరూ యవ్వనంగా కనిపించాలని (Detox Drink) కోరుకుంటారు. వృద్ధాప్య ఛాయలు కనిపించని మెరిసే చర్మం సొంతం చేసుకోవాలని ఎన్నో క్రీములు, ఫేస్ ప్యాక్‌ల వంటివి ట్రై చేస్తుంటారు. అయితే ప్రకృతి ప్రసాదించిన వాటితోనే ప్రకాశవంతంగా కనిపించవచ్చని సహజసిద్ధమైన ఆహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉండటంతో పాటు మెరిసే చర్మాన్ని పొందవచ్చని, వృద్ధాప్య ఛాయలను నివారించవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
వయసు కనపించని యాంటీ ఏజింగ్ డీటాక్స్ డ్రింక్ అద్భుత పానీయంగా తయారుచేసుకోవచ్చని సూచిస్తున్నారు. ఈ డ్రింక్ వృద్ధాప్య లక్షణాలను నెమ్మదింపచేయడంతో పాటు చర్మం నిగారించేలా చేస్తుందని ప్రముఖ డైటీషియన్ మన్‌ప్రీత్ కల్రా చెబుతున్నారు. ఈ డ్రింక్ డీ హైడ్రేషన్నూ నివారిస్తుంది. చర్మ సౌందర్యం కాపాడుకోవాలంటే తగినంత నీరు తాగడంతో పాటు చర్మాన్ని సంరక్షించే ఆరోగ్యకర ఫ్యాటీ యాసిడ్స్నూ తీసుకోవాలి.
View this post on Instagram
A post shared by Dt Manpreet Kalra | Hormone and Gut Health Coach | (@dietitian_manpreet)
ఇక డైటీషియన్ సూచించే డీటాక్స్ డ్రింక్ ఎలా తయారుచేసుకోవాలంటే..లీటర్ నీటిలో చియా సీడ్స్, కీరా, పుదీనా ఆకులు, నిమ్మకాయ ముక్కలు, అల్లం, యాలకులను వేసి ఇవన్నీ మిక్స్ అయ్యేలా బాగా కలపాలి. ఆపై రోజంతా ఈ నీటిని తాగడం ద్వారా ఆరోగ్య ప్రయోజనాలతో పాటు మెరిసే చర్మం సొంతం చేసుకోవచ్చు.
Read More :
IndiGo | విమానం గాల్లో ఉండగానే ఎమర్జెన్సీ డోర్ తెరవబోయిన ప్రయాణికుడు..!