Korean Kimchi | కొరియన్ కిమ్చితో మెరిసే చర్మం సొంతం
Korean Kimchi : కొరియన్ సంప్రదాయ ఆహారం కిమ్చితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. క్యాబేజ్‌ను షుగర్, సాల్ట్, ఆనియన్, అల్లం, వెల్లుల్లి, మిర్చితో కలిపి పులియబెట్టిన అనంతరం ఈ కిమ్చి తయారవుతుంది.
Korean Kimchi : కొరియన్ సంప్రదాయ ఆహారం కిమ్చితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. క్యాబేజ్‌ను షుగర్, సాల్ట్, ఆనియన్, అల్లం, వెల్లుల్లి, మిర్చితో కలిపి పులియబెట్టిన అనంతరం ఈ కిమ్చి తయారవుతుంది. కిమ్చిని ముల్లంగి, క్యారట్, కీరా దోస, పాలకూర వంటి ఇతర కూరగాయలతోనూ తయారుచేసుకోవచ్చు. కిమ్చి పుల్లగా, స్పైసీగా, కొంచెం వగరుగా ఉంటూ కొరియన్ డిష్‌ల్లో ఫేవరెట్ డిష్‌గా చెబుతుంటారు.
ఈ కిమ్చి కొరియన్లను ఆరోగ్యవంతులుగా ఉంచడంతో పాటు వారి మెరిసే చర్మం సీక్రెట్ కూడా అని పోషకాహార నిపుణులు పేర్కొంటున్నారు. కిమ్చితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని గుర్గావ్లోని సిట్రిన్ క్లినిక్ వ్యవస్ధాపకులు, డెర్మటాలజిస్ట్ డాక్టర్ నీతి గౌర్ చెప్పారు. కిమ్చిలో ప్రేవుల ఆరోగ్యాన్ని ప్రేరేపించే మంచి బ్యాక్టీరియా ఎదుగుదలకు ఉపయోగపడే ప్రొబయోటిక్స్ అధికంగా ఉంటాయి. ప్రొబయోటిక్స్‌తో చర్మంపై వాపు ప్రక్రియ తలెత్తకుండా నిరోధించడంతో పాటు యాక్నె, ఎజీమను నివారిస్తాయి. కిమ్చిలో చర్మ సంరక్షణకు కీలకమైన విటమిన్ ఏ, విటమిన్ సీతో పాటు పలు యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి.
ఫ్రీ రాడికల్స్, స్ట్రెస్, యూవీ రేడియన్ నుంచి చర్మాన్ని కాపాడటంలో యాంటీఆక్సిడెంట్లు చురుకైన పాత్ర పోషిస్తాయి. ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను తగ్గించడం ద్వారా కిమ్చిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మ సౌందర్యాన్ని కాపాడతాయి. ఇంకా కిమ్చిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ పదార్ధాలు శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. కిమ్చిలో విటమిన్ ఏ, సీ, విటమిన్ కేతో పాటు ఇందులో ఉండే క్యాల్షియం, ఐరన్, ఇతర పోషకాలు చర్మ సంరక్షణకు ఉపయోగపడతాయి.
Read More :
Virat Kohli | లండన్ కేఫ్‌లో కూతురితో కోహ్లీ.. పిక్స్ వైరల్
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AINRC: పుదుచ్చరి ఉప ఎన్నికలో ఏఐఎన్ఆర్సీ పార్టీ విజయం
Godavari water | గోదావరి జలాలు విడుదల చేయాలని పురుగుల మందు డబ్బాలతో రైతుల ధర్నా
రాయపోల్ నూతన ఎస్ఐకి ఘన సన్మానం!
Jason Sanjay | సీఎం విజయ్ కొడుకు హీరోగా ఎంట్రీ?.. లైకా ప్రొడక్షన్స్‌తో చర్చలు!
Delhi Metro Stations: అక్టోబర్ 10 నిరసన నేపథ్యంలో.. 57 మెట్రో స్టేషన్లు మూసివేత !
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

