న్యూఢిల్లీ : శరీరానికి శక్తిని, పోషకాలను అందించే పరాటాలను చాలా మంది వేడి చేస్తుందనో ఇతర కారణాలతో వేసవిలో దూరం పెడుతుంటారు. అయితే పరాటాలను తయారు చేసే పద్ధతుల్లో చిన్న మార్పులతో వాటిని వేసవిలోనూ ఆరోగ్యానికి (Health Tips) మేలు చేసే విధంగా మలుచుకోవచ్చు.
సింపుల్ బ్రేక్ఫాస్ట్లా పరిగణించే పరాటాలను అధిక క్యాలరీలుంటాయనే కారణంతోనూ కొందరు అవాయిడ్ చేస్తుంటారు. పరాటాలో వాడే పదార్ధాల్లో మార్పులు చేయడంతో పాటు వాటిని వండి వడ్డించే పద్ధతిలో చిన్నపాటి మార్పులతో వేసవితో పాటు అన్ని సీజన్లలోనూ వాటిని నిరభ్యంతరంగా తీసుకునేలా చేయవచ్చు. పరాటాలను తయారుచేయడంలో ముందుగా అందులో వాడే పిండిని మార్చుకోవాలి.
మైదా బదులు గోధుమ పిండిని వాడితే చవకైన ప్రత్యామ్నాయమే కాకుండా అందులో ఉండే సూక్ష్మ పోషకాలతో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. కడుపులోనూ ఇది చల్లగా ఉండటంతో పాటు జీర్ణ ప్రక్రియ సజావుగా సాగేలా చేస్తుంది. పరాటాల్లో ఆలూ, గోభికి ప్రత్యామ్నాయంగా ఆయా సీజన్లలో లభించే కూరగాయలను స్టఫ్ చేయడంతో పాటు నేయితో కాల్చడం బదులు పరాటాలను తక్కువ నేయి లేదా తక్కువ నూనెతో కాల్చడం మేలు. ఇక పరాటాలను పరిమితంగా తీసుకుంటే జీర్ణం కావడం తేలికవుతుంది.
Read More
Beauty Tips | టీ ఎక్కువగా తాగితే నల్లబడతారా?