HomeNewsDrinking Tea Darkens The Skin Tone Is It Myth Or Fact
Beauty Tips | టీ ఎక్కువగా తాగితే నల్లబడతారా?
Beauty Tips | టీ తాగడం వల్ల చర్మం నల్లగా మారుతుందని చాలామంది నమ్ముతుంటారు. కొందరైతే టీ బదులు పాలు, కాఫీ తాగుతుంటారు. అయితే టీ తాగడానికి, చర్మ సౌందర్యానికి సంబంధం ఉందా? టీ తాగితే నల్లగా అవుతారా? ఆ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..
2/5
టీ తాగడం వల్ల చర్మం నల్లగా మారుతుందనేది ఒక అపనమ్మకం మాత్రమే. చర్మం ఆకృతి, రూపు రేఖలపైన మాత్రమే రంగు ఆధారపడి ఉంటుంది. చర్మ రంగు మారడానికి టీ మాత్రం కారణం కాదు. టీ, కాఫీ లేదా కెఫిన్ అధికంగా ఉండే ద్రావణాలు చర్మాన్ని ఏవిధంగాను ప్రభావితం చేయవు.
3/5
పండ్లు, కూరగాయల్లో మాదిరిగానే అనేక రకాల యాంటీ ఆక్సిడెంట్లు ఆరోగ్యానికి ఉపయోగకరం. గుండె సంబంధిత వ్యాధులు, క్యాన్సర్‌ల అభివృద్ధిని ఇవి నిరోధిస్తాయి. కాకపోతే, టీని అధికంగా తాగడం వల్ల చర్మం డీహైడ్రేషన్‌కు గురవుతుంది.
4/5
రోజులో ఎక్కువసార్లు టీ తాగేవారికి మాత్రమే చర్మం నల్లబడే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. చర్మం నల్లగా మారడానికి అధికంగా టీ తాగడం మాత్రమే కారణం కాకపోవచ్చు. నిద్రలేకపోవడం, ఒత్తిడి లేదా ఇతర ఆరోగ్య సమస్యలవల్ల కూడా చర్మం నల్లగా మారవచ్చు.
5/5
చర్మం అనారోగ్యానికి గురవడానికి చాలా కారణాలున్నాయి. సూర్యరశ్మి కావచ్చు. కాలుష్యం కూడా కారణం కావచ్చు. ఉద్రేకతకు లోనయినప్పుడూ చర్మం ఎరుపురంగులోకి మారే అవకాశం ఉంది.
6/5
చర్మం నిగనిగలాడాలంటే పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. టీ కాఫీలు మోతాదుకు మించి తీసుకోవద్దు. ముఖంపై మొటిమలు, జిడ్డు రాకుండా ఉండాలంటే జంక్‌ఫుడ్‌కు దూరంగా ఉండాలి. ఎక్కువ వేడి, ఎక్కువ చల్లగా ఉన్న పదార్థాలు తీసుకోవద్దు.