న్యూఢిల్లీ : నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఒత్తిడి, అనారోగ్యకరమైన ఆహారం తీసుకోవడం పలు జీవనశైలి వ్యాధులకు దారితీస్తోంది. హృద్రోగాలు, బీపీ, మధుమేహం వంటి వ్యాధులు పెరిగిపోవడం, గుండె పోటుతో యువతలో పెరుగుతున్న హఠాన్మరణాల నేపధ్యంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన జీవన శైలిపై దృష్టి సారించడం అవసమరని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
పలు హృద్రోగాలకు మూలకారణంగా చెబుతున్న హైబీపీని నివారించేందుకు హైపర్‌టెన్షన్‌ను నియంత్రించే ఆహార విధానం (డ్యాష్ డైట్) కీలకమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కూరగాయలు, పండ్లు, తృణ ధాన్యాలు, కొవ్వు తక్కువగా ఉండే డైరీ ఉత్పత్తులు, గుడ్లు, బీన్స్, పప్పు ధాన్యాలను అధికంగా తీసుకోవాలని చెబుతున్నారు.
రెడ్ మీట్, ఫుల్ ఫ్యాటీ డైరీ ఉత్పత్తులు, నూనెల వంటి సంతృప్త కొవ్వులు అధికంగా ఉండే ఆహార పదార్ధాలకు దూరంగా ఉండటం మేలని సూచిస్తున్నారు. ఉప్పు, చక్కెర అధికంగా ఉండే ఆహార పదార్ధాలతో పాటు శీతల పానీయాల జోలికి వెళ్లవద్దని పేర్కొంటున్నారు. హైబీపీ, ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ రెండూ హృద్రోగాలు, స్ట్రోక్‌కు ముప్పుగా పరిణమించాలని వీటిని పూర్తిగా అదుపులో ఉంచుకోవాలని సూచిస్తున్నారు.