Cinnamon Water | దాల్చిన చెక్కలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. కనుకనే ఆయుర్వేదంలో ఎంతో పురాతన కాలం నుంచి దాల్చిన చెక్కను ఉపయోగిస్తున్నారు. దీన్ని పలు ఔషధాల తయారీలో వాడుతారు. దాల్చిన చెక్కను చాలా మంది మసాలా వంటల్లో వేస్తుంటారు. దీంతో వంటలకు చక్కని రుచి, వాసన వస్తాయి. అయితే దాల్చి చెక్కను నీటిలో మరిగించి ఆ నీళ్లను ఒక కప్పు మోతాదులో రోజూ ఉదయం పరగడుపునే తాగాల్సి ఉంటుంది. ఇలా ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీళ్లను తాగితే ఎన్నో అద్భుతమైన లాభాలను పొందవచ్చు. దాల్చిన చెక్క మనకు ఏవిధంగా ప్రయోజనాలను అందిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
దాల్చిన చెక్క నీళ్లను తాగడం వల్ల డయాబెటిస్ అదుపులో ఉంటుంది. ఈ నీళ్లను తాగితే శరీరంలో ఇన్సులిన్ సెన్సిటీవిటీ పెరుగుతుంది. అంటే శరీరం ఇన్సులిన్‌ను మరింత సమర్థవంతంగా ఉపయోగించుకుంటుందన్నమాట. దీంతో బ్లడ్ షుగర్ లెవల్స్ తగ్గుతాయి. ఫలితంగా డయాబెటిస్ కంట్రోల్ లో ఉంటుంది. కనుక మధుమేహం ఉన్నవారికి ఈ నీళ్లు బెస్ట్ మెడిసిన్ అని చెప్పవచ్చు.
దాల్చిన చెక్క నీళ్లను తాగడం వల్ల శరీర మెటబాలిజం పెరుగుతుంది. దీంతో క్యాలరీలు వేగంగా ఖర్చవుతాయి. ఫలితంగా కొవ్వు కరుగుతుంది. దీంతో అధిక బరువు త్వరగా తగ్గుతారు. ఈ నీళ్లను తాగితే ఆకలి నియంత్రణలో ఉంటుంది. దీంతో ఆహారం తక్కువగా తింటారు. ఇది కూడా బరువు తగ్గేందుకు సహాయ పడుతుంది. అందువల్ల దాల్చిన చెక్క నీళ్లను రోజూ ఖాళీ కడుపుతో తాగాల్సి ఉంటుంది. అప్పుడే ప్రయోజనం ఉంటుంది.
దాల్చిన చెక్కలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని, వాపులను తగ్గిస్తాయి. దీంతో కణాలు డ్యామేజ్ అవకుండా రక్షించబడతాయి. దీని వల్ల రోగాలు రాకుండా ఉంటాయి. ఈ నీళ్లలో కార్మినేటివ్ గుణాలు ఉంటాయి. అంటే ఈ నీళ్లను తాగితే జీర్ణశక్తి పెరుగుతుందన్నమాట. దీంతోపాటు కడుపు ఉబ్బరం, గ్యాస్ నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే జీర్ణక్రియ మెరుగు పడుతుంది. మనం తినే ఆహారంలో ఉండే పోషకాలను శరీరం సరిగ్గా శోషించుకుంటుంది. దీంతో జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. దాల్చిన చెక్కలో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. అందువల్ల ఈ నీళ్లను తాగితే నొప్పులు, వాపుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇది కీళ్లు, మోకాళ్ల నొప్పులు ఉన్నవారికి ఎంతగానో మేలు చేస్తుంది. ఆయా నొప్పుల నుంచి బయట పడవచ్చు.
దాల్చిన చెక్క నీళ్లను తాగడం వల్ల శరీరంలోని కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి. ముఖ్యంగా చెడు కొలెస్ట్రాల్ అయిన ఎల్డీఎల్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ అయిన హెచ్‌డీఎల్ పెరుగుతుంది. దీంతో రక్తనాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. ఫలితంగా హార్ట్ ఎటాక్ రాకుండా అడ్డుకోవచ్చు. ఈ నీళ్లలో యాంటీ మైక్రోబియల్ గుణాలు ఉంటాయి. అందువల్ల ఈ నీళ్లను తాగితే రోగ నిరోధక వ్యవస్థ పటిష్టంగా మారుతుంది. దీంతో ఇన్ఫెక్షన్లు, వ్యాధులు రావు. అలాగే దగ్గు, జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇలా దాల్చిన చెక్క నీళ్లను తాగడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు.