రోగ నిరోధక శక్తి పెంచే జ్యూస్‌లు ఇవే..
రోగ నిరోధక శక్తి | మన ఆరోగ్యానికి చాలా అవసరం. జలుబు, దగ్గు, జ్వరం ఇలా ఏ అనారోగ్య సమస్యను అయినా రోగ నిరోధక శక్తి ఉంటే సులభంగా ఎదుర్కోవచ్చు.

రోగ నిరోధక శక్తి .. మన ఆరోగ్యానికి చాలా అవసరం. జలుబు, దగ్గు, జ్వరం ఇలా ఏ అనారోగ్య సమస్యను అయినా సరే రోగ నిరోధక శక్తి ఉంటే సులభంగా ఎదుర్కోవచ్చు. అదే ఇమ్యూనిటీ పవర్ దెబ్బతింటే శరీరం నీరసిస్తుంది. అనేక రకాల ఆరోగ్య సమస్యలు ఎదరవుతాయి. అందుకే రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం చాలా అవసరం. మరి రోగ నిరోధక శక్తిని పెంచడంలో పలు రకాల పండ్ల రసాలు దోహదం చేస్తాయి. అవేంటో చూద్దామా..

కర్బుజా జ్యూస్
నీటి శాతం ఎక్కువగా ఉండే పుచ్చకాయ రోగ నిరధక శక్తిని పెంచుతుంది. అంతేకాకుండా ఏవైనా ఇన్ఫెక్షన్ల బారిన పడినప్పుడు కలిగే కండరాల నొప్పిని తగ్గిస్తుంది. పుచ్చకాయలోని గింజలు కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కాబట్టి వాటిని తీసేయకుండానే జ్యూస్ చేసుకుని తాగడం మంచిది.

టమాటా జ్యూస్
ఏ సీజన్లలో అయినా దొరికే టమాటాల్లో విటమిన్ సీ, ఈ, బీటా కెరోటిన్ పుష్కలంగా లభిస్తుంది. ఈ పోషకాలు రోగ నిరోధక శక్తిని తగ్గించే ఫ్రీ రాడికల్స్‌ను అడ్డుకుంటాయి. రోజూ టమాటా జ్యూస్ తాగడం వల్ల రోగ నిరోధక శక్తి పెరగడమే కాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.

సిట్రస్ పండ్ల జ్యూస్
నిమ్మ, నారింజ, ద్రాక్ష వంటి సిట్రస్ పండ్లలో విటమిన్ సీ పుష్కలంగా ఉంటుంది. ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో విటమిన్ సీ సమర్థవంతంగా పనిచేస్తుంది. సిట్రస్ పండ్ల జ్యూస్‌లు తాగడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.
గుండె పనితీరు మెరుగుపడటంతో పాటు జీర్ణ సంబంధిత సమస్యలు కూడా దూరమవుతాయి. గ్యాస్, ఎసిడిటీ నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది.

బీట్రూట్ జ్యూస్
బీట్రూట్లో విటమిన్ సీ, ఈ ఎక్కువగా ఉంటుంది. అలాగే కాల్షియం, ఐరన్ కూడా పుష్కలంగా లభిస్తుంది. కాబట్టి రక్తహీనతతో బాధపడేవారు బీట్రూట్ జ్యూస్ తాగడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. బీట్రూట్లో లభించే లైకోపిన్, ఆంథోసైయనిన్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
అలాగే అధిక రక్తపోటును తగ్గించడంతో పాటు పెద్దవాళ్లలో మెదడుకు రక్తప్రవాహం పెంచడంతో సహాయపడుతుంది. బీట్రూట్లో వాపు తగ్గించే గుణం ఉండటం వల్ల ఇది కాలేయం ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది.

క్యారెట్ జ్యూస్
క్యారెట్లలో విటమిన్ ఏ, బీ1, బీ2, బీ3, నియాసిన్, ఫోలెట్, కాల్షియం, పొటాషియం, మెగ్నిషియం వంటి పోషకాలతో పాటు పీచు పుష్కలంగా ఉంటుంది. క్యారెట్ జ్యూస్‌లోని బీటా కెరోటిన్ కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇమ్యూనిటీని పెంచుతుంది.

యాపిల్ జ్యూస్
రోగ నిరోధక శక్తిని పెంపొదించుకోవడంలో యాపిల్ జ్యూస్ కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. యాపిల్‌లో విటమిన్ ఏ, బీ1 బీ2, బీ6, సీ విటమిన్లతో పాటు ఫోలిక్ యాసిడ్, నియాసిన్, జింక్, పొటాషియం వంటి ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఇవి ఇమ్యూనిటీని పెంచడంతో పాటు నరాల వ్యవస్థను బలోపేతం చేస్తాయి.
– నవీన్ కుమార్ రెడ్డి
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
టీవీ చూస్తూ స్నాక్స్ తింటున్నారా.. జాగ్రత్త..!
మీలో రక్తహీనత ఉందని తెలిపే లక్షణాలు ఇవే..!
వేసవిలో నిత్యం ఈ పండ్లను తప్పనిసరిగా తినాల్సిందే ఎందుకంటే..?
నిద్రకు ముందు గ్రీన్ టీ తాగితే..?
పసుపు పాలు తాగితే ఎన్ని లాభాలో..!
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

