Anjeer : మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన పదార్థాలను ఆహారంలో భాగం చేసుకోవాలి. మన ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి పండ్లు ఎంతగా దోహదం చేస్తాయో అందరికీ తెలుసు. ఆరోగ్యంగా ఉండాలంటే ఏ సీజన్లో లభించే పండ్లను ఆ సీజన్లో తినాలి. వాటిలో కొన్ని తప్పనిసరిగా తినాల్సిన పండ్లు కూడా ఉంటాయి. అలాంటి వాటిలో అంజీర పండ్లు ఒకటి. అంజీరా పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ పండ్లు చేసే మేలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రయోజనాలు
అంజీరా పండ్లలో విటమిన్లు, మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం, ఐరన్, ప్రోటీన్లు, కార్బోహైడ్రేడ్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఈ పండ్లను రోజూ తినడం వల్ల శరీరానికి కావలసిన శక్తి అందుతుంది. ఉత్సాహంగా ఉంటుంది.
అంజీరా పండ్లను నీళ్లలో నానబెట్టుకుని తింటే మంచిది. ఉదయం నిద్ర లేచిన వెంటనే రాత్రి నానబెట్టుకున్న అంజీర పండ్లను తినడం వల్ల మన ఆరోగ్యం మెరుగుపడుతుంది.
అంతేగాక అంజీర పండ్లతో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. అంజీరా పండ్లు మలబద్ధకాన్ని కూడా తగ్గిస్తాయి. మూలశంఖ వంటి వ్యాధులను నయం చేస్తాయి.
మనం బరువు తగ్గడానికి, మన శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్‌ను కరిగించడానికి కూడా అంజీర పండ్లు ఎంతో దోహదం చేస్తాయి.
అంజీరా పండ్లు తినడం వల్ల బరువు అదుపులోకి వస్తుంది. అధిక రక్తపోటు తగ్గుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు సైతం అంజీరా పండ్లను తినవచ్చు.
డయాబెటిస్ ఉన్నవారు అంజీరా పండ్లను రోజూ తింటే షుగర్ లెవల్స్ అదుపులోకి వస్తాయి. గుండె సంబంధిత వ్యాధులకు, నెలసరి సమస్యలకు, కిడ్నీ సమస్యలు ఉన్నవాళ్లకు కూడా అంజీరా పండ్లు మేలు చేస్తాయి.
సంతానలేమి సమస్యను తగ్గించడంలో కూడా అంజీరా పండ్లు దోహదం చేస్తాయి. అంజీర పండ్లు తినడంవల్ల పురుషులలో వీర్యం వృద్ధి జరుగుతుంది. స్త్రీలలో అండోత్పత్తి సమస్యలు తగ్గుతాయి. అంజీరా పండ్లు రక్తహీనతను కూడా తగ్గస్తాయి.