Health Tips | ఆ నాలుగు రోజులు బాగా ఇబ్బంది పడుతున్నారా.. అయితే తరచూ ఈ పండు తినండి..!
Health Tips | ప్రకృతి ప్రతి జీవికి అమూల్యమైన పండ్లను ప్రసాదిస్తుంది. ప్రకృతి ప్రసాదించే ఈ అన్ని రకాల పండ్లలో ఆరోగ్యానికి మేలుచేసే పోషకాలు ఉంటాయి. దాదాపు అన్ని పండ్లకు రోగనిరోధక శక్తిని పెంచే లక్షణం కూడా ఉంటుంది.
Health Tips : ప్రకృతి ప్రతి జీవికి అమూల్యమైన పండ్లను ప్రసాదిస్తుంది. ప్రకృతి ప్రసాదించే ఈ అన్ని రకాల పండ్లలో ఆరోగ్యానికి మేలుచేసే పోషకాలు ఉంటాయి. దాదాపు అన్ని పండ్లకు రోగనిరోధక శక్తిని పెంచే లక్షణం కూడా ఉంటుంది. ఈ పండ్లలో కొన్నింటిని సలాడ్ల రూపంలోగానీ, జ్యూస్‌ల రూపంలోగానీ తీసుకోవడం ద్వారా మనం ఎదుర్కొంటున్న ఎన్నో అనారోగ్య సమస్యలకు చక్కని పరిష్కారం లభిస్తుంది. అలాంటి వాటిలో అనాస పండు (Pine apple) కూడా ఒకటి. ఈ పైనాపిల్‌తో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రయోజనాలు..
1. అనాస పండు జ్యూస్ తాగడం ద్వారా వాతం తగ్గుతుంది. కఫం నుంచి ఉపశమనం లభిస్తుంది.
2. అప్పుడప్పుడూ పైనాపిల్ తినడంవల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టకుండా ఉంటుంది.
౩. అనాస పండులో పీచుపదార్థం అధికంగా ఉంటుంది. ఇది మలబద్దకానికి మంచి మందుగా పనిచేస్తుంది.
4. బాగా పండిన అనాస పండు తినడం ద్వారా పంటి చిగుళ్ల నుంచి రక్తం కారడం తగ్గుతుంది.
5. దోరగా పండిన అనాస పండు రసం తాగడం ద్వారా కడుపులో నులి పురుగులు చచ్చిపోతాయి.
6. జ్వరం, కామెర్లు వంటి అనారోగ్యాలతో ఉన్నవారికి అనాస రసం ఇవ్వడంవల్ల ఎంతో మేలు జరుగుతుంది.
7. తురచూ అనాసను తీసుకుంటే వాపులు, నాసికా సంబంధమైన వ్యాధులు, టైఫాయిడ్ నుంచి ఉపశమనం లభిస్తుంది.
8. ఆడవారిలో చాలామంది నెలసరి క్రమం తప్పడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. తరచూ పైనాపిల్ తీసుకోవడం ద్వారా హార్మోన్ల అసమతుల్యత తగ్గి నెలసరి సక్రమంగా వస్తుంది.
9. పైనాపిల్ ఆరోగ్యానికే కాదు అందానికి కూడా తోడ్పడుతుంది. తరచూ అనాస పండు రసంతో ముఖానికి మర్దన చేసుకుంటే చర్మం కోమలంగా మారుతుంది. అంతేగాక ముఖంపై నల్లటి మచ్చలు కూడా తొలగిపోతాయి.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Man Catches Employee With Daughter | ఇంట్లో కుమార్తెతో కలిసి ఉన్న ఉద్యోగి.. బ్యాట్‌తో కొట్టి చంపిన యజమాని
రిమ్స్ బాధిత కుటుంబానికి కేటీఆర్ భరోసా.. రూ.లక్ష ఆర్థిక సాయం అందించిన కోవ లక్ష్మి
GLP-1 Medicine | బరువు తగ్గించే జీఎల్పీ-1 మందులను వాడితే కండరాల నష్టం జరుగుతుందా..? ఏం చేయాలి..?
Rythu Garjana Sabha | బీఆర్ఎస్ రైతు గర్జన పోస్టర్ ఆవిష్కరణ.. ఈ నెల 11న నిర్మల్‌లో కేటీఆర్ సభ
డీప్‌ఫేక్ వీడియోలతో ఎంఐఎం బహిష్కృత ఎమ్మెల్సీకి బెదిరింపులు.. రూ.5 కోట్లు డిమాండ్ చేసిన ముఠా!
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

