Cherries | చెర్రీ పండ్లు అంటే అందరికీ ఇష్టమే. వీటిని అందరూ ఎంతో ఇష్టంగా తింటుంటారు. కేకుల తయారీల్లో అలంకరణ కోసం ఎక్కువగా వాడుతారు. పలు స్వీట్లు, పానీయాల తయారీకి కూడా ఈ పండ్లను ఉపయోగిస్తారు. ఇవి చూసేందుకు ఎరుపు రంగులో ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తాయి. కనుకనే చాలా మంది వీటిని ఇష్టపడుతుంటారు. ఈ పండ్లు కాస్త తియ్యగా, కాస్త పుల్లగా ఉంటాయి. చెర్రీ పండ్లలో అనేక విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. ఇవి మనకు అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందిస్తాయి. చెర్రీ పండ్లను తినడం ద్వారా మనం అనేక పోషకాలను సైతం పొందవచ్చు. దీని వల్ల పోషకాహార లోపం సమస్య నుంచి బయట పడవచ్చు. పలు వ్యాధులను నయం చేసుకునేందుకు కూడా ఈ పండ్లు ఎంతో దోహదం చేస్తాయి. చెర్రీ పండ్లను రోజూ ఒక కప్పు మోతాదులో తింటే అనేక లాభాలు కలుగుతాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
చెర్రీ పండ్లలో అనేక పోషకాలు ఉంటాయి. ఫైబర్, ప్రోటీన్లు, విటమిన్ సి, పొటాషియం, కాపర్, మాంగనీస్ ఉంటాయి. ఇవి మన శరీరానికి పోషణను అందిస్తాయి. దీని వల్ల పోషకాహార లోపం నుంచి బయట పడవచ్చు. ఈ పండ్లను తినడం వల్ల శరీరానికి తక్షణమే శక్తి లభిస్తుంది. దీంతో నీరసం, అలసట తగ్గుతాయి. ఉత్సాహంగా మారుతారు. చురుగ్గా పనిచేస్తారు. బద్దకం పోతుంది. శరీరంలో శక్తి స్థాయిలు అధికంగా ఉంటాయి. శారీరక శ్రమ లేదా వ్యాయామం చేసేవారికి ఈ పండ్లు ఎంతో మేలు చేస్తాయి. చిన్నారులకు ఈ పండ్లను రోజూ తినిపించడం వల్ల వారు యాక్టివ్గా ఉంటారు. మెదడు వికసిస్తుంది. చదువుల్లో, క్రీడల్లో రాణిస్తారు. ఈ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు సైతం అధికంగా ఉంటాయి. ఇవి యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలను కలిగి ఉంటాయి. అందువల్ల ఈ పండ్లను తింటే శరీరంలోని వాపులు తగ్గిపోతాయి. ముఖ్యంగా ఆర్థరైటిస్ ఉన్నవారికి మేలు జరుగుతుంది. కీళ్ల నొప్పులు, వాపులు తగ్గిపోతాయి.
చెర్రీ పండ్లలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు అధిక మొత్తంలో ఉంటాయి కనుక ఈ పండ్లను తింటే శరీర రోగ నిరోధక వ్యవస్థ పటిష్టంగా మారుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో సీజనల్ వ్యాధులకు చెక్ పెట్టవచ్చు. దగ్గు, జలుబు వంటి సమస్యల నుంచి సులభంగా బయట పడవచ్చు. చెర్రీ పండ్లలో మెగ్నిషియం అధికంగా ఉంటుంది. ఇది కండరాలను ప్రశాంతంగా మారుస్తుంది. దీంతో కండరాల నొప్పులు తగ్గుతాయి. ముఖ్యంగా రాత్రి పూట నిద్రలో కాలి పిక్కలు పట్టుకుపోయే సమస్య ఉన్నవారు ఈ పండ్లను తింటుంటే ఉపయోగం ఉంటుంది. అలాగే శారీరక శ్రమ, వ్యాయామం చేసేవారికి కండరాల హాయినిస్తాయి. చక్కని దేహ దారుఢ్యం సొంతమవుతుంది. ఈ పండ్లలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది శరీరంలో రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది. దీని వల్ల బీపీ నియంత్రణలో ఉంటుంది. హైబీపీ ఉన్నవారికి ఈ పండ్లు ఎంతో మేలు చేస్తాయి.
చెర్రీ పండ్లను తింటుంటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా అడ్డుకోవచ్చు. అలాగే శరీరంలో అధికంగా ఉండే సోడియం బయటకు వెళ్లిపోతుంది. దీని వల్ల కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి. కిడ్నీలపై పడే భారం తగ్గుతుంది. ఆర్థరైటిస్, గౌట్ వంటి సమస్యలు ఉన్నవారు రోజూ చెర్రీ పండ్లను తింటుంటే మేలు జరుగుతుంది. దీని వల్ల కీళ్లలో గుజ్జు పెరగడమే కాదు, యూరిక్ యాసిడ్ స్థాయిలు తగ్గుతాయి. దీంతో నొప్పులు, వాపుల నుంచి ఉపశమనం లభిస్తుంది. చెర్రీ పండ్లను తింటుంటే మన శరీరంలో మెలటోనిన్ ఉత్పత్తి అవుతుంది. ఇది నిద్రను ప్రేరేపించే హార్మోన్. దీని వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. మైండ్ రిలాక్స్ అవుతుంది. రాత్రి పూట నిద్ర చక్కగా పడుతుంది. నిద్రలేమి తగ్గుతుంది. ఇలా చెర్రీ పండ్లను రోజూ ఒక కప్పు మోతాదులో తింటుండడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు.