రాత్రి పూట వద్దు
వేసవి కాలం వచ్చిందంటే చాలు.. దాహార్తిని తీర్చుకోవడానికి పుచ్చకాయలను తింటుంటాం. పుచ్చకాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కానీ, అది ఏ సమయంలో తింటున్నామనేదే ముఖ్యం. ముఖ్యంగా రాత్రి 7 గంటల తర్వాత ఏ రకమైన పండ్లు తీసుకోకపోవడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
వేసవి కాలం వచ్చిందంటే చాలు.. దాహార్తిని తీర్చుకోవడానికి పుచ్చకాయలను తింటుంటాం. పుచ్చకాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కానీ, అది ఏ సమయంలో తింటున్నామనేదే ముఖ్యం. ముఖ్యంగా రాత్రి 7 గంటల తర్వాత ఏ రకమైన పండ్లు తీసుకోకపోవడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. పుచ్చకాయలో 94 శాతం నీరు, లైకోపీన్, పొటాషియం వంటి అద్భుతమైన పోషకాలు ఉంటాయి.
అయితే, ఇది కొద్దిగా ఆమ్ల గుణాన్ని కలిగి ఉంటుంది. రాత్రి వేళ మన శరీరం విశ్రాంతి స్థితిలో ఉన్నప్పుడు ఇది జీర్ణక్రియను మందగింపజేస్తుంది. మన జీర్ణవ్యవస్థ అత్యంత చురుగ్గా ఉన్న సమయంలో (మధ్యాహ్నం 12 నుంచి 1 గంటల మధ్య) పుచ్చకాయ తినడం ఉత్తమం. ఆయుర్వేదం ప్రకారం కూడా రాత్రి పూట పుచ్చకాయ తినడం మంచిది కాదు. రాత్రి పూట మెటబాలిజం తకువగా ఉంటుంది.
ఈ సమయంలో అధిక చకెర, నీరు ఉండే పుచ్చకాయ తింటే పొట్ట భారంగా అనిపించడం, గ్యాస్ పట్టేయడం లాంటి సమస్యలు వస్తాయి. పుచ్చకాయలో నీటి శాతం ఎకువ. రాత్రి పడుకునే ముందు దీన్ని తింటే పదే పదే మూత్ర విసర్జనకు వెళ్లాల్సి వస్తుంది. దీనివల్ల నిద్రకు భంగం కలుగుతుంది. ముఖ్యంగా హైదరాబాద్ వంటి నగరాల్లో రాత్రి పూట బిర్యానీ వంటి భారీ భోజనం చేయడం ఒక సంస్కృతిగా మారింది. ఇలాంటి భారీ భోజనం తర్వాత పండ్లు తినడం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఐబీఎస్ లేదా గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవారు రాత్రి పూట పుచ్చకాయకు దూరంగా ఉండాలి. చక్కరవ్యాధితో బాధపడేవారు, బరువు తగ్గాలనుకునే వారు సైతం దూరంగా ఉండటమే మేలు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- life style
- night
- Summer
- watermelon
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

