Apps:
Follow us on:

Jamun Fruit | ఈ సమస్యలు ఉన్న వాళ్లు నేరేడు పండ్లను అస్సలు తినకూడదు

1/11నేరేడు పండ్లలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. అందుకే వీటిని ఆయుర్వేదం, హోమియోపతిలో కూడా ఉపయోగిస్తుంటారు. అయితే, వీటిని మితంగా తిన్నప్పుడే ఆరోగ్యం బాగుంటుంది. అదే అతిగా తింటే లేనిపోని సమస్యలు వచ్చి పడతాయి.
2/11అతిగా తినడమే కాదు.. ఔషధ గుణాలు కలిగిన నేరేడు పండ్లను అందరూ తినకూడదు. అలా కాదని తింటే ఆరోగ్యం దెబ్బతింటుంది. మరి నేరేడు పండ్లు  ఎవరు తినొద్దు? ఎప్పుడు తినొద్దనే విషయాలు ఇప్పుడు గమనిద్దాం..
3/11నేరేడు పండ్లను ఖాళీ కడుపుతో అస్సలు తినకూడదు. పాలు తాగిన తర్వా నేరేడు పండ్లను అస్సలు తినకూడదు. అలాగే వీటిని తిన్న వెంటనే మంచినీళ్లు తాగకూడదు.
4/11నేరేడు పండ్లు తిన్న తర్వాత పసుపు వేసిన పదార్థాలు, పచ్చళ్లు కూడా తినడం ఆరోగ్యానికి మంచిది కాదు.
5/11నేరేడు పండ్లను అధికంగా తినడం వల్ల జ్వరం, గొంతు సమస్యలు వస్తాయి. శ్వాస సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది.
6/11నేరేడు పండ్లు శరీరంలోని వాత దోషాన్ని తీవ్రతరం చేస్తాయి. కాబట్టి వీటిని అధికంగా తినకపోవడమే మంచిది.
7/11నేరేడు పండ్లు అధికంగా తినడం వల్ల మొటిమలు వస్తాయి. చర్మ సమస్యలు ఉన్న వారు వీటిని తినడం వల్ల అలర్జీలు ఎక్కువవుతాయి.
8/11నేరేడు పండ్లను అధికంగా తినడం వల్ల గ్యాస్ట్రిక్‌ సమస్య తలెత్తే అవకాశం ఉంది. మలబద్దకంతో బాధపడేవారు ఈ పండ్లను తినకపోవడమే మంచిది.
9/11గర్భిణులు, పాలిచ్చే తల్లులు డాక్టర్‌ సలహా లేకుండా నేరేడు తినడం మంచిది. కాదు.
10/11నేరేడు పండ్లు అధికంగా తినడం వల్ల రక్తపోటు తగ్గుతుంది. అలాగే రక్తంలోని చక్కెర స్థాయి కూడా తగ్గుతుంది. కాబట్టి ఆపరేషన్లకు ముందు, తర్వాత తినకపోవడం ఉత్తమం.
11/11నేరేడు పండ్లు తిన్నప్పుడు వాంతులు, వికారం వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. అలాంటివాళ్లు కూడా దూరంగా ఉండాలి.