న్యూఢిల్లీ cమనలో చాలా మందికి టీ (Masala Tea) తాగనిదే రోజు ప్రారంభం కాదు. ఇక చలికాలంలో అయితే చాలా మంది గరం ఛాయ్ గొంతులో దిగనిదే పనుల్లోకి దిగరు. బ్లాక్ టీ, మసాలా టీ, గ్రీన్ టీ, మిల్క్ టీ ఇలా టీ ఏదైనా వారి అభిరుచికి తగిన టీని ఆస్వాదిస్తుంటారు.
ఇక అల్లం, దాల్చిన చెక్క, మిరియాలు వంటి ఎన్నో దినుసులతో కూడిన మసాలా టీని పలువురు సేవిస్తుంటారు. అయితే మసాల దినుసులతో కూడిన టీని అధికంగా తీసుకుంటే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని, దీన్ని పరిమితంగా తీసుకుంటూ బ్యాలెన్స్ పాటించడం మేలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
చలికాలంలో మసాలా టీని సేవిస్తే రోగనిరోధక శక్తి మెరుగుపడటం, జీవక్రియల వేగం పెరగడం వంటి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నా దీన్ని ఎక్కువ సార్లు తీసుకుంటే మాత్రం ఇబ్బందులు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక మసాలా టీ మోతాదు మించి ఆస్వాదిస్తే తలెత్తే ఆరోగ్య సమస్యలు పరిశీలిస్తే..
అజీర్తి, మలబద్ధకం
కేఫిన్తో సమస్యలు
అలర్జీ రియాక్షన్స్
అధిక రక్తపోటు
గుండెలో మంట
Read More :