పేగుల్లో మలం గట్టిపడిపోయి.. శరీరం నుంచి సులువుగా బయటికి రాకపోవడమే.. మలబద్ధకం. నిర్లక్ష్యం చేస్తే కనుక.. కడుపుబ్బరం, గ్యాస్, అతిగా తేన్చడం, కడుపునొప్పి, ఆకలి మందగించడం, మొలలు మొదలైన సమస్యలకు దారితీస్తుంది.
పేగుల్లో మలం గట్టిపడిపోయి.. శరీరం నుంచి సులువుగా బయటికి రాకపోవడమే.. మలబద్ధకం. నిర్లక్ష్యం చేస్తే కనుక.. కడుపుబ్బరం, గ్యాస్, అతిగా తేన్చడం, కడుపునొప్పి, ఆకలి మందగించడం, మొలలు మొదలైన సమస్యలకు దారితీస్తుంది. మలబద్ధకానికి ప్రధాన కారణాలు..
చీజ్ లాంటి పాల ఉత్పత్తులు ఎక్కువగా తీసుకోవడం.
గంటలకొద్దీ ఒకేచోట కూర్చుని ఉద్యోగం చేసేవారిలో ఈ ముప్పు మరీ ఎక్కువ.
కుంగుబాటు కూడా మలబద్ధకానికి కారణమే.
పిండిపదార్థాలు తక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం.
అతిగా వ్యాయామం చేయడం.
అదేపనిగా చాక్లెట్లు తినడం.
యాంటీబయాటిక్స్, యాంటీ డిప్రెసెంట్స్ ఎక్కువ రోజులు వాడటం.