Britan : పుట్టుకతోనే గుండె జబ్బుతో బాధపడుతున్న పిల్లాడికి బ్రిటన్ వైద్యులు అరుదైన సర్జరీ చేశారు. గుండెకు ఆపరేషన్ చేయకుండా నే అతడి సమస్యను పోగొట్టారు. దాత నుంచి సేకరించిన స్టెమ్ సెల్స్‌తో ఆ పిల్లాడి గుండె జబ్బును విజయవంతంగా నయం చేశారు. డోనర్ స్టెమ్ సెల్‌తో గుండె జబ్బుకు ట్రీట్మెంట్ చేయడం అనేది ప్రపంచంలోనే ఇదే మొదటిసారి. విల్ట్‌షైర్‌లోని ఫిన్లేకు పుట్టడంతోనే హృదయ సంబంధిత సమస్య ఉంది. దాంతో అతడి తల్లి మెలిసా హడ్ ఎంతో బాధపడింది. అయితే.. 2020లో దాత బొడ్డు తాడు నుంచి సేకరించిన స్టెమ్ సెల్స్‌ను ఫిన్లేకు ఎక్కించారు. రెండేళ్ల తర్వాత అతను పూర్తి ఆరోగ్యంతో ఉన్నాడు. బ్రిటన్‌కు చెందిన మస్సిమో కపుటో హార్ట్ ఫెడరేషన్ ప్రొఫెసర్ ఈ స్టెమ్ సెల్స్ ప్యాచెస్ ప్రయోగానికి ఆద్యుడు.
దాంతో, ఓపెన్ హార్ట్ సర్జరీల బదులు స్టెమ్ సెల్ థెరపీతో గుండె జబ్బుల్ని నయం చేసే రోజులు రాబోతున్నాయి. అయితే, స్టెమ్ సెల్ ప్యాచ్‌లతో ఒక సమస్య ఉందని, ఇవి సహజంగా వచ్చిన గుండె కవాటాల మాదిరిగా పిల్లల వయసుతో పాటు పెరగవని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. దాంతో, ఎదిగే పిల్లల్లో ఈ ప్యాచెస్‌ను తరచూ మార్చాల్సి రావొచ్చని తెలిపారు. అలా చేయాల్సి వస్తే వాళ్లు వారం పాటు ఆస్పత్రిలో ఉండాలని శాస్త్రవేత్తలు అంటున్నారు.
పుట్టుకతో గుండె జబ్బులు రావడం అనేది పిల్లల్లో చాలా ఎక్కువ. వీళ్లలో చాలావరకు గుండె కవాటాలు, గుండెకు దగ్గర్లోని ప్రధాన రక్తనాళాల్లో అవకతవకలు ఏర్పడాయి. గుండెకు రంధ్రం పడడం వంటివి కనిపిస్తాయి. బ్రిటన్‌లో ప్రతిరోజు అప్పుడే పుట్టిన దాదాపు 13 మంది పిల్లల్లో ఈ సమస్యను గుర్తించినట్టు వైద్యులు తెలిపారు. ఇలాంటి పిల్లలకు తాత్కాలికంగా ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తున్నారు.