Cardiac Arrest Symptoms | ప్రస్తుత తరుణంలో చాలా మంది కార్డియాక్ అరెస్ట్‌తో చనిపోతున్న విషయం తెలిసిందే. కార్డియాక్ అరెస్ట్ అంటే గుండె పోటు అని అనుకుంటారు. అది నిజమే కానీ ఇది కాస్త భిన్నంగా ఉంటుంది. కార్డియాక్ అరెస్ట్ అంటే గుండెకు ప్రసారం అయ్యే పంపింగ్ వ్యవస్థ పనిచేయదు. ఇది జరిగిన మరుక్షణమే గుండె ఆగి మరణిస్తారు. ఇది హార్ట్ ఎటాక్ కు కాస్త భిన్నమైంది. ఇది చాలా ప్రమాదకరమైంది. ప్రస్తుతం చాలా మంది కార్డియాక్ అరెస్ట్ బారిన పడి వెంటనే చనిపోతున్నారు. అయితే ఇందుకు కారణాలు ఏమున్నప్పటికీ కార్డియాక్ అరెస్ట్ వచ్చేందుకు నెల రోజుల ముందే పలు లక్షణాలు కనిపిస్తాయని వైద్యులు చెబుతున్నారు.
కార్డియాక్ అరెస్ట్ వచ్చేందుకు నెల రోజుల ముందే మనకు పలు సంకేతాలను శరీరం తెలియజేస్తుందట. వాటిని పసిగట్టడం ద్వారా జాగ్రత్త పడవచ్చని డాక్టర్లు చెబుతున్నారు. కార్డియాక్ అరెస్ట్ వచ్చే ముందు తీవ్రమైన అలసటగా, నీరసంగా ఉంటుంది. చిన్న పని చేసినా చాలు తీవ్రంగా అలసిపోతారు. విపరీతమైన నీరసం ఉంటుంది. ఏమాత్రం చురుగ్గా ఉండరు. యాక్టివ్‌గా పనిచేయలేకపోతుంటారు. అడుగు తీసి అడుగు వేయడం కష్టమవుతుంది. ఈ లక్షణాలు కనిపిస్తున్నాయంటే మాత్రం దాన్ని కార్డియాక్ అరెస్ట్‌గా భావించాలి. వెంటనే డాక్టర్ ను కలిసి పరీక్షలు చేయించుకోవాలి.
కార్డియాక్ అరెస్ట్ వచ్చే ముందు శ్వాస తీసుకోవడం కూడా ఇబ్బంది అవుతుంది. ఛాతిపై ఏదో బరువు పెట్టినట్లు అనిపిస్తుంది. శ్వాస ఆడడం కష్టంగా మారుతుంది. అదేవిధంగా ఛాతిలో అసౌకర్యంగా ఉంటుంది. ఇక గుండె కూడా అసాధారణ రీతిలో కొట్టుకుంటుంది. గుండె కొట్టుకునే వేగం బాగా పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది. అలాగే పాదాలు, చేతుల్లో వాపులు కనిపిస్తాయి. అక్కడంతా నీరు చేరుతుంది. వేలితో టచ్ చేస్తే చర్మం లోపలికి పోతుంది.
ఇలా గనుక ఎవరిలో అయినా లక్షణాలు కనిపిస్తుంటే వారికి కార్డియాక్ అరెస్ట్ రాబోతుందని తెలుసుకోవాలి. దీంతో వెంటనే జాగ్రత్త పడాలి. డాక్టర్‌ను కలిసి పరీక్షలు చేయించుకోవాలి. ఏదైనా సమస్య ఉంటే టెస్టుల్లో తేలిపోతుంది. దీంతో డాక్టర్ సూచన మేరకు చికిత్స తీసుకుని ప్రాణాలను కాపాడుకోవచ్చు. ఇక గుండె పోటు వచ్చే ముందు కూడా దాదాపుగా ఇలాంటి లక్షణాలే కనిపిస్తాయి. కాకపోతే గుండెపోటును కాస్త భిన్నంగా వైద్యులు చెబుతారు.
రక్తనాళాల్లో ఏవైనా అడ్డంకులు ఏర్పడితే గుండె పోటు వస్తుంది. గుండె పోటు వచ్చిన వారిని మొదటి గంటలో జాగ్రత్తగా చూసుకుంటే వారు బతికే అవకాశాలు ఉంటాయి. కానీ కార్డియాక్ అరెస్ట్ అలా కాదు. ఇది వచ్చిందంటే మరణించాల్సిందే. కాబట్టి పైన తెలిపిన లక్షణాల పట్ల అందరూ జాగ్రత్తగా ఉండండి. ఏమాత్రం అనుమానం వచ్చినా వెంటనే డాక్టర్‌ను కలిసి చికిత్స తీసుకోండి. లేదంటే తరువాత బాధపడినా ప్రయోజనం ఉండదు.