పెద్దవారిలో క్యాన్సర్ ముప్పు
మనిషి శరీరంలో కణాలు పరిపక్వ స్థితికి రాగానే ఒకటికి ఎన్నో కణాలుగా విభజన చెందుతూ ఎప్పటికప్పడు కొత్త కణాలు ఏర్పడుతూ ఉంటాయి.
మనిషి శరీరంలో కణాలు పరిపక్వ స్థితికి రాగానే ఒకటికి ఎన్నో కణాలుగా విభజన చెందుతూ ఎప్పటికప్పడు కొత్త కణాలు ఏర్పడుతూ ఉంటాయి. వయసు పెరిగేకొద్దీ ప్రతి కణానికీ కాలం చెల్లిపోతుంది. చిన్న వయసులో శరీర కణాలు వేగంగా వృద్ధి చెందుతూ ఉంటాయి. అందుకే మనిషి ఎదుగుదల సాధ్యమవుతుంది. కానీ, వయసు పెరిగేకొద్దీ కణాలు విభజన చెందడం, వృద్ధి చెందడం తగ్గిపోయి..
శరీరం ఎదుగుదల నిలిచిపోతుంది. ఈ క్రమంలో కాలంచెల్లిన కణాలను భర్తీ చేయడానికి మాత్రమే వయసు పైబడిన వారిలో కొత్త కణాలు పుడుతుంటాయి. అయితే సహజసిద్ధంగా, ఒక క్రమబద్ధంగా జరిగే ప్రక్రియలో ఎక్కడో తేడా వచ్చి.. పాత కణాలు క్షీణించకుండానే, అనేక కొత్త కణాలు పుట్టుకురావడం వల్ల శరీర భాగాలలో కణుతులు ఏర్పడతాయి. ఏర్పడిన ప్రదేశానికి మాత్రమే పరిమితమయ్యే కణుతులను ‘నాన్ క్యాన్సర్ కణుతులు’ అంటారు. వీటివల్ల పెద్ద ప్రమాదం ఏమీ ఉండదు. శరీరంలోని ఒక అవయవ భాగంలో ఏర్పడి.. దాని చుట్టుపక్కల, ఇతర భాగాలకు వ్యాపించే కణుతులను
‘క్యాన్సర్ కణుతులు’గా పరిగణిస్తారు.
ఆ వయసులో క్యాన్సర్లు వచ్చే అవకాశం ఎక్కువ :
నేషనల్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ సర్వే ప్రకారం కొత్తగా కనిపిస్తున్న క్యాన్సర్లలో 60శాతం వ్యాధులు 65ఏండ్ల వయసు పైబడిన వారిలోనే కనిపిస్తున్నాయి. దీంతోపాటు వారిలో 70శాతం వరకూ మృత్యువాత పడుతున్నారు. తక్కువ వయసు వారితో పోలిస్తే 65ఏండ్లు పైబడిన వారు క్యాన్సర్ బారిన పడే ప్రమాదం 10రెట్లు అధికంగా ఉంటుంది. వయసు పైబడినవారిలో దాదాపు అన్ని రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా కోలన్, రెక్టల్, ప్రొస్టేట్, ప్యాంక్రియాజ్, ఊపిరితిత్తులు, మూత్రాశయం, పొట్ట, రొమ్ము క్యాన్సర్ వంటివి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా వచ్చిన క్యాన్సర్ కణుతులు చికిత్సకు లొంగడం కష్టం.
ప్రధాన కారణాలు :
- చిన్నవయసు నుండి దీర్ఘకాలికంగా ధూమపానం, మద్యపానం, ఎక్కువమందితో శారీరక సంబంధాలు పెట్టుకోవడం వంటి దురలవాట్లు.
- వయసు పైబడేకొద్దీ రోగ నిరోధక శక్తి తగ్గడం.
- కొన్నిరకాల హార్మోన్లు ఎక్కువగా తీసుకోవడం.
- కణాలలో మార్పులు నెమ్మదించి, వయసు పెరిగిన తరువాత బయటపడటం.
- వృత్తిపరంగా కొన్నిరకాల రసాయనాలకు ఎక్కువగా గురవడం.
- వేర్వేరు వ్యాధులు.. వాటికి తీసుకునే చికిత్సలు
- వెర్నర్ సిండ్రోమ్, అల్జీమర్స్, ఎయిడ్స్ వంటి వ్యాధులున్న వారికి వయసు పెరిగే కొద్దీ క్యాన్సర్లు వచ్చే అవకాశాలు ఎక్కువ.
- 60ఏండ్లు పైబడిన తరువాత కూడా నెలసరి ఆగలేదంటే అనుమానించాలి.
- 9 ఏండ్లలోనే నెలసరి, ఆలస్యంగా వివాహం, నడి వయసులో గర్భందాల్చడం వంటివి రొమ్ము క్యాన్సర్‌కు దారితీయవచ్చు.
- పురుషులలో టెస్టోస్టిరాన్ హార్మోన్ల స్థాయిల్లో వచ్చే మార్పులు ప్రొస్టేట్ క్యాన్సర్‌కు దారితీసే అవకాశం ఉంటుంది.
చికిత్సా పద్ధతులు :
అధిక రక్తపోటు, మధుమేహం, కీళ్ల అరుగుదల, థైరాయిడ్ సమస్యలు, గుండె రక్తనాళాలలో పూడికలు వంటి సమస్యలు.. వయసుతోపాటు పెరిగి వేధిస్తూ ఉంటాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని రోగులకు క్యాన్సర్ చికిత్స చాలా జాగ్రత్తగా, పర్సనలైజ్డ్గా ఇవ్వాల్సి ఉంటుంది. రోగి శరీర ఆరోగ్య పరిస్థితులనే కాకుండా వారి మానసిక, సామాజిక, కుటుంబ, ఆర్థిక పరిస్థితుల గురించి కూడా ఆలోచించి క్యాన్సర్ రోగులకు ధైర్యం చెబుతూ చికిత్స ఇవ్వాల్సి ఉంటుంది. ఈ క్రమంలో క్యాన్సర్ చికిత్సలో భాగంగా కౌన్సెలింగ్‌కు ప్రాముఖ్యత పెరుగుతున్నది. హార్మోన్లకు సంబంధించిన క్యాన్సర్ చికిత్సల్లో భాగంగా సర్జరీ, రేడియేషన్, కీమోలతోపాటు హార్మోన్ థెరపీకి అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది.
ముందస్తు పరీక్షలు :
40ఏండ్ల వయస్సు పైబడిన స్త్రీలు మమోగ్రామ్ వంటి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు, 50ఏండ్లు పైబడిన పురుషులు పీఎస్ఏ టెస్ట్, హెపటైటిస్ బి, లంగ్, లివర్ ఫంక్షనింగ్ పరీక్షలు వంటివి చేయించుకోవడం ఉత్తమం. చిన్న వయసునుంచే మంచి ఆహార, వ్యవహార, జీవనశైలితోపాటు శరీరంలో మార్పులను ముందే పసిగట్టే స్క్రీనింగ్ పరీక్షల ద్వారా తొలి దశలోనే సరైన చికిత్సతో వయసు పైబడిన వారిలో వచ్చే క్యాన్సర్లకు చెక్ పెట్టవచ్చు. అయితే వయసు పెరిగిన అందరిలో క్యాన్సర్లు రావు. కానీ, వచ్చే అవకాశాలు ఉన్నాయి.
డాక్టర్ మోహనవంశీ చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్, ఒమేగా హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ 98490 22121
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governor Shukla | యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న గవర్నర్ శుక్లా
Revolt brews in NC | ఎన్సీలో తిరుగుబాటు?.. 19 మంది ఎమ్మెల్యేల భేటీ, తీర్మానం
Kodangal | కొడంగల్‌లో కేజీబీవీ భవనంపై నుంచి పడి విద్యార్థినికి తీవ్ర గాయాలు.. సమాచారాన్ని గోప్యంగా ఉంచిన అధికారులు
Netflix | ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చేసిన క్రేజీ సినిమాలు, వెబ్ సిరీస్‌లు!
Pony Verma | రాజకీయల వల్లే ప్రకాశ్‌రాజ్‌ని సినిమాల నుంచి తొలగించారు: పోని వర్మ
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

