Immunity boosters : కరోనా టైంలో ఇమ్యూనిటీ పెరగాలంటే ఇవి చాలా అవసరం
ఇమ్యూనిటీ ( Immunity boosters ) | కరోనావైరస్ నుంచి రక్షించుకునేందుకు జాగ్రత్తలు మాత్రమే పాటిస్తే సరిపోదు. ఇమ్యూనిటీని పెంచే ఆహారాన్ని తీసుకోవాలి.
Immunity boosters | కరోనావైరస్ ( coronavirus )మళ్లీ దేశాన్ని వణికిస్తుంది! సెకండ్ వేవ్ ( Secondwave ) లో చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ కరోనా బారిన పడుతున్నారు. ఇలాంటి సమయంలో కరోనావైరస్ నుంచి రక్షించుకునేందుకు జాగ్రత్తలు మాత్రమే పాటిస్తే సరిపోదు. కరోనా వైరస్‌ను సమర్థంగా ఎదుర్కొనేందుకు కావాల్సిన రోగ నిరోధక శక్తిని ( Immunity ) పెంపొందించుకోవడం కూడా చాలా అవసరం. ఇందుకోసం రోజూ వ్యాయామం ( Exercise ) చేయడంతో పాటు కంటి నిండా నిద్ర పోవాలి. వీటితో పాటు ముఖ్యంగా ఇమ్యూనిటీని పెంచే ఆహారాన్ని తీసుకోవాలి. సమతుల్య ఆహారం తీసుకున్నప్పుడే శరీరానికి కావాల్సిన అన్ని విటమిన్లు ( Vitamins ), పోషకాలు లభిస్తాయి. మరి ఇమ్యూనిటీ ( Immunity )పెరగాలంటే మన శరీరానికి ఏ ఏ విటమిన్లు కావాలి? అవి ఎందులో ఎక్కువగా లభిస్తాయో తెలుసుకుందాం..

విటమిన్ ఏ
కరోనా వైరస్ ఎక్కువగా గుండె, ఊపిరితిత్తులపైనే ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. ఈ అవయవాలు సరిగ్గా పనిచేయడంలో విటమిన్ ఏ సహాయపడుతుంది. యాంటీ ఆక్సిడెంట్లలో విటమిన్ ఏ కూడా ముఖ్యమైనదే. అలాగే రోగ నిరోధక శక్తి సక్రమంగా పనిచేయడంలో విటమిన్ ఏ కీలకపాత్ర పోషిస్తుంది. రోగ నిరోధక వ్యవస్థలో భాగమైన టీ కణాలు, బీ కణాలు, సైటోకైన్లు, తెల్ల రక్తకణాల పనితీరును ఇది మెరుగుపరుస్తుంది. దీనివల్ల వైరల్ ఇన్ఫెక్షన్లు, జలుబు, ఫ్లూ వచ్చే అవకాశం తగ్గుతుంది. పాలకూర, చేపలు, క్యారెట్లు, గుడ్లు, మామిడి పండ్లు, బొప్పాయిలో విటమిన్ ఏ పుష్కలంగా లభిస్తుంది.
బీటా కెరొటిన్
బీటా కెరొటిన్‌ను ప్రొ విటమిన్ అంటారు. ఇది శరీరానికి అవసరమైనప్పుడు విటమిన్ ఏ రూపంలోకి మారుతుంది. ఇది క్యారెట్, కందగడ్డ, పాలకూర, ఆఫ్రికాట్స్‌లో ఎక్కువగా లభిస్తుంది.
విటమిన్ బీ12
శరీరానికి శక్తిని ఇవ్వడంతో పాటు తిన్న ఆహారంలోని ప్రోటీన్లు విచ్ఛిన్నం కావడానికి కోబాలమైన్ ( విటమిన్ బీ 12) సహాయపడుతుంది. తెల్ల రక్తకణాలు వృద్ధి చెందడంలోనూ కీలక పాత్ర పోషిస్తుంది. చేపలు, మాంసం, గుడ్లు, పాలు, పెరుగులో ఇది పుష్కలంగా లభిస్తుంది.
Read More : vaccine registration : 18 ఏళ్లు పైబడిన వారు కరోనా టీకా కోసం ఇలా రిజిస్టర్ చేసుకోండి
విటమిన్ సీ
ఇమ్యూనిటీ పవర్‌ను ఉత్తేజితం చేయడంలో విటమిన్ సీ దోహదపడుతుంది. తెల్ల రక్తకణాల ఉత్పత్తిని పెంచడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. కరోణా లక్షణాలైన జలుబు, ఫ్లూ, జ్వరం, గొంతు ఇన్ఫెక్షన్ల తీవ్రత తగ్గించడంలో విటమిన్ సీ సహాయపడుతుంది. అయితే మిగతా విటమిన్లలా విటమిన్ సీని శరీరం ఉత్పత్తి చేసుకోలేదు. కాబట్టి ఆహారం ద్వారానే శరీరానికి తగినంత సీ విటమిన్ అందేలా చేసుకోవాలి. సిట్రస్ జాతి పండ్లైన బత్తాయి, నారింజ, నిమ్మలో విటిమన్ సీ ఎక్కువగా ఉంటుంది. జామ, బొప్పాయి, స్ట్రాబెర్రీ, క్యాబేజీ, పచ్చి మిరప, ఆలుగడ్డలు, కొత్తిమీరలోనూ విటమిన్ సీ పుష్కలంగా లభిస్తుంది.
విటమిన్ డీ
రోగ నిరోధక శక్తి సక్రమంగా పనిచేయడానికి విటమిన్ డీ అవసరం. శరీరంలోకి చేరిన బ్యాక్టీరియా, వైరస్‌లను ఎదుర్కొనే టీ కణాలు, మైక్రోఫేజెస్ కణాల పనితీరును ఇది మెరుగుపరుస్తుంది. విటమిన్ డీ తక్కువగా ఉంటే శ్వాసకోశ సంబంధిత వ్యాధుల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కరోనా బారిన పడితే ఎక్కువగా శ్వాసకోశ వ్యాధులే వేధిస్తాయి కాబట్టి ఈ సమయంలో కావాల్సినంత డీ విటమిన్ శరీరానికి అందేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఉదయం పూట శరీరానికి ఎండ తగిలేలా చూసుకోవడం వల్ల విటమిన్ డీ కావాల్సినంత అందుతుంది.
ReadMore: Vaccine Doubts : మొదటి డోస్ కోవాగ్జిన్, రెండో డోస్ కోవిషీల్డ్ తీసుకోవచ్చా?
విటమిన్ ఈ
వైరస్‌లను అడ్డుకునే టీ కణాల సామర్థ్యాన్ని, కణాల విభజనను విటమిన్ ఈ పెంచుతుంది. దీనివల్ల రోగ నిరోధక శక్తి మెరుగుపడుతుంది. శరీరంలో ఇన్ఫ్లమేషన్ ఎక్కువ అయితే శ్వాసకోశ వ్యాధుల బారిన పడే ముప్పు పెరుగుతుంది. అయితే ఇలాంటి ఇన్ఫ్లమేషన్కు కారణమయ్యే కారకాలను కూడా ఇది అడ్డుకుంటుంది. కాబట్టి కరోనా సమయంలో ఈ విటమిన్‌ను పెంచుకునేందుకు బాదం, పల్లీలు, పాలకూర, సన్‌ఫ్లవర్ ఆయిల్, సోయాబిన్ నూనెను ఆహారంగా తీసుకోవడం మంచిది.
విటమిన్ కే
రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరచడంలో విటమిన్ కే సహాయపడుతుంది. తాజా ఆకుకూరలు, గుడ్లు, బ్రకోలీలో ఇది పుష్కలంగా లభిస్తుంది.
జింక్
రోగ నిరోధక వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి జింక్ చాలా అవసరం. ఇది దెబ్బతిన్న రోగ నిరోధక వ్యవస్థను సరిదిద్దడంలో సహాయపడుతుంది. గింజలు, మాంసం, పాలు, పెరుగు, మజ్జిగలో జింక్ ఎక్కువగా లభిస్తుంది.
Also Read : Corona effect : ఆక్సిజన్ లెవల్స్ ఎలా పెంచుకోవాలి
ఐరన్
రోగ నిరోధక వ్యవస్థ సజావుగా పనిచేయడానికి, ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో ఐరన్ తోడ్పడుతుంది. మాంసం, చికెన్, పప్పులు, పాలకూర, తోటకూరలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది.
ప్రోటీన్లు
యాంటీబాడీలు, రోగ నిరోధక కణాలు సమర్థంగా పనిచేయడానికి ప్రోటీన్లు సహాయపడుతాయి. చికెన్, మాంసం, గుడ్లతో పాటు కందులు, పెసలు, శనగలు, పాలు, పాల ఉత్పత్తుల్లో ప్రోటీన్లు ఎక్కువగా లభిస్తాయి.
– నవీన్ కుమార్ రెడ్డి
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
ఒక్క మాస్క్ సరిపోదా? రెండు మాస్కులు కచ్చితంగా వాడాలా?
కొవిడ్ సెకండ్ వేవ్ భిన్నం.. వచ్చే 4 వారాలు ఎందుకు కీలకమంటే..?
Corona effect : భారత్ నుంచి ప్రయాణాలపై ఆస్ట్రేలియా ఆంక్షలు
దేశంలో అందుబాటులోకి మరో టీకా.. జైడస్ క్యాడిలా టీకాకు డీసీజీఐ అనుమతి
మే మూడో వారంలో కరోనా మరింత ఉద్ధృతం: ఎస్బీఐ రిపోర్ట్
గుజరాత్ లో దారుణం : కొవిడ్ బెడ్ కోసం రూ 9000కు బేరం
బోర్లా పడుకుంటే ఆక్సిజన్ లెవల్స్ పెరుగుతాయా.. ఆ వైరల్ వీడియోలో నిజమెంత?
Corona effect : ఆక్సిజన్ లెవల్స్ ఎలా పెంచుకోవాలి
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Arjun Rajput: పాకిస్థాన్‌తో వన్డే మ్యాచ్.. అర్జున్ రాజ్‌ఫుత్ సెంచరీ
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

