Blood Purifying Foods | మన శరీరానికి రక్తం ఇంధనం లాంటిదని చెప్పవచ్చు. ఇది అనేక రకాల పోషకాలను శరీరంలోని కణాలకు, అవయవాలకు సరఫరా చేస్తుంది. అలాగే ఆక్సిజన్‌ను రవాణా చేస్తుంది. దీంతో శరీర అవయవాలకు ఎప్పటికప్పుడు శక్తి, పోషణ లభిస్తాయి. అలాగే ఆయా అవయవాల్లో పేరుకుపోయే వ్యర్థాలను రక్తం బయటకు తీసుకు వస్తుంది. అందువల్ల రక్తం చాలా శుభ్రంగా ఉండాలి. రక్తంలో గ్లూకోజ్ లేదా కొవ్వులు, ఇతర పోషకాలు సరైన స్థాయిలో ఉండాలి. వ్యర్థాలు కూడా పేరుకుపోకూడదు. అందుకు గాను రక్తాన్ని శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చు. ఇక పలు రకాల ఆహారాలను తీసుకోవడం వల్ల రక్తశుద్ధి జరుగుతుంది. రక్తం శుభ్రంగా మారి రోగాల నుంచి బయట పడతాము. ఇక రక్తం శుద్ధి అవ్వాలంటే అందుకు తీసుకోవాల్సిన ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కొందరు రోజుకు తగినన్ని నీళ్లను తాగరు. దీంతో రక్తంలో వ్యర్థాలు పేరుకుపోతాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. రక్తం శుభ్రంగా ఉండాలన్నా, అందులోని వ్యర్థాలు బయటకు ఎప్పటికప్పుడు పోవాలన్నా నీళ్లను రోజూ తగిన మోతాదులో తాగాల్సి ఉంటుంది. అలాగే కిడ్నీలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. ఇక రక్త శుద్ధి జరగాలంటే రోజూ ఉదయం పచ్చి వెల్లుల్లి రెబ్బలను నేరుగా అలాగే తింటుండాలి. ఇవి ఘాటుగా ఉంటాయి కనుక చాలా మంది తినలేరు. అయితే వెల్లుల్లిని తేనెతో కలిపి తినవచ్చు. దీంతో కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి. రక్తంలో ఉండే వ్యర్థాలు సులభంగా బయటకు పోతాయి. కనుక వెల్లుల్లిని రోజూ ఆహారంలో భాగం చేసుకోవాలి. అలాగే రోజూ భోజనం చేసిన అనంతరం చిన్న బెల్లం ముక్కను తినడం వల్ల కూడా రక్తం శుద్ధి అవుతుంది. శరీరంలో రక్త సరఫరా పెరుగుతుంది. బీపీ నియంత్రణలోకి వస్తుంది.
పసుపును మనం నిత్యం వంటల్లో ఉపయోగిస్తుంటాం. పసుపు కూడా రక్తాన్ని శుద్ధి చేయడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో అనేక రకాల యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. రక్తాన్ని శుద్ధి చేస్తాయి. రోజూ పుసుపు టీ తాగవచ్చు. లేదా రాత్రి పూట పాలలో పసుపు కలిపి తాగినా కూడా మేలు జరుగుతుంది. అదేవిధంగా నిమ్మరసం కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. నిమ్మరసం సేవిస్తుంటే కేవలం రక్తం శుద్ధి జరగడమే కాదు లివర్, శరీరం కూడా శుభ్రంగా మారుతాయి. వ్యర్థాలు సులభంగా బయటకు పోతాయి. కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే యాపిల్స్‌ను కూడా ఆహారంలో భాగం చేసుకోవచ్చు. ఇవి కూడా రక్తాన్ని క్లీన్ చేయగలవు. రక్తం తయారయ్యేలా చేస్తాయి. దీంతో రక్తహీనత నుంచి బయట పడవచ్చు.
ఆకుపచ్చని కూరగాయలు లేదా ఆకుకూరల్లో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. ఇది రక్తహీనతను తగ్గిస్తుంది. రక్త సరఫరా మెరుగు పడేలా చేస్తుంది. దీంతో రక్తశుద్ధి కూడా జరుగుతుంది. ఇక క్యాబేజీని కూడా ఆహారంలో భాగం చేసుకుంటే మేలు జరుగుతుంది. దీంతోనూ రక్తం శుభ్రంగా మారుతుంది. ఓట్స్, నట్స్‌ను ఆహారంలో భాగం చేసుకుంటే శరీరానికి శక్తి, పోషణ లభించడమే కాదు రక్తం క్లీన్ అవుతుంది. ఇలా పలు రకాల ఆహారాలను తీసుకోవడం వల్ల రక్తాన్ని క్లీన్ చేసుకోవచ్చు. దీంతోపాటు కిడ్నీలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. మూత్రం సాఫీగా జారీ అవుతుంది. ఆరోగ్యంగా ఉంటారు.