న్యూఢిల్లీ : వేసవిలో నూనె పదార్ధాలు, మసాలాలకు దూరంగా ఉంటూ కూరగాయలను అధికంగా తీసుకుంటే ఆరోగ్యానికి ( Health Tips) మేలు చేకూరుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అన్ని సీజన్లలో లభించే బెండ కాయతో మధుమేహం అదుపులో ఉండటంతో పాటు పలు ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. పోషకాలతో నిండిఉండే బెండ కాయలో ఫైబర్, విటమిన్లు, మినరల్స్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి.
లేడీస్ ఫింగర్గా పేరొందిన ఈ కూరగాయ ఫైబర్ అధికంగా ఉండటంతో పాటు తక్కువ క్యాలరీలు, లో గ్లైసెమిక్ ఇండెక్స్‌తో రక్తంలో షుగర్ లెవెల్స్‌ను తగ్గిస్తుంది. ఇందులో ఫైబరతో పాటు ప్రొటీన్ కూడా ఉండటంతో ఆరోగ్యానికి మేలు చేస్తుందని, శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుందని చెబుతున్నారు. తగినంత ప్రొటీన్ తీసుకుంటే అది దీర్ఘకాలం మధుమేహ నియంత్రణకు ఉపకరిస్తుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఇక బెండకాయతో ఆరోగ్య ప్రయోజనాలను పరిశీలిస్తే..
అధిక కొవ్వుకు చెక్
హృద్రోగ ముప్పు నివారణ
వ్యాధి నిరోధక శక్తి
ఎముకల బలోపేతం
చర్మ సంరక్షణ
బరువు నియంత్రణ
Read More
మెదడుకు ముప్పు.. మే 24-ప్రపంచ స్కిజోఫ్రేనియా దినం