Health Tips : పోషకాహారం తీసుకుంటూ రోజూ తగినంత వ్యాయామం చేయడం ద్వారా బరువు తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతుంటారు. అయితే ఈ వెయిట్ లాస్ జర్నీ అంతా రోజులో మనం తీసుకునే తొలి ఆహారంపై ఆధారపడిఉంటుంది. మనం ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్‌గా ఏం తీసుకున్నామనేది రోజంతా మనం ఉత్సాహంగా ఉండటం, ఆకలి, పనిచేసే తీరు అంతటినీ నిర్ధేశిస్తుంది.
అంతటి విలువైన అల్పాహారంపై చాలా మంది పెద్దగా ఫోకస్ పెట్టరు. త్వరగా ఆఫీస్‌కు వెళ్లాలనో, ఇతర పనుల ఒత్తిడితోనే ఏదో తిన్నామనే రీతిలో బ్రేక్‌ఫాస్ట్ కానిచ్చేస్తుంటారు. ఉదయాన్నే మనం తీసుకునే తొలి ఆహారం పోషకాలతో కూడినదై ఉండటంతో పాటు త్వరగా ఆకలి వేయకుండా ఉండాలని, రోజంతా జీవక్రియల వేగం పెంచేలా ఉండాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
బ్రేక్‌ఫాస్ట్‌లో ప్రొటీన్, ఆరోగ్యకర కొవ్వులు అధికంగా ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు. ప్రతిరోజూ ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్‌లో ఈ ఆహారం ఉండేలా చూసుకోవాలని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు. అల్పాహారంగా ఈ ఆహార పదార్ధాలు తీసుకుంటే మేలని సూచిస్తున్నారు.
ఎగ్స్
ప్రొటీన్లు, ఆరోగ్యకర కొవ్వులు
బెర్రీస్, చియా సీడ్స్
బనానా
పెరుగు
డ్రై ఫ్రూట్స్
Read More :
Health Tips | రోజులో ఎన్నిసార్లు తినొచ్చు? ఎన్ని గంటల నిడివిలో తినాలి?