Beauty Tips | పచ్చిపాలలో ఉండే విటమిన్లు, ప్రొటీన్స్తో పాటు లాక్టిక్ యాసిడ్ చర్మానికి చాలా మేలు చేస్తుందని చెబుతున్నారు సౌందర్య నిపుణులు. ఆ లాభం అందుకోవాలంటే పచ్చిపాలతో రూపొందించే కొన్ని ఫేస్ ప్యాక్‌లను సూచిస్తున్నారు. అవి…
పచ్చిపాలు-పసుపు: ఈ కలయిక చర్మాన్ని కాంతిమంతం చేసి, మొటిమలు మచ్చల్ని తగ్గిస్తుంది.
పచ్చిపాలు- తేనె: పొడిబారిన చర్మం ఉన్నవారిలో ఈ ఫేస్ ప్యాక్ తేమను మెరుగుపరుస్తుంది.
పచ్చిపాలు- ఓట్మీల్: ఈ మిశ్రమాన్ని చర్మం మీద నిదానంగా రుద్దుతూ మసాజ్ చేస్తే మృతకణాలు తొలగిపోతాయి.
పచ్చిపాలు- దోసగుజ్జు: చర్మానికి చల్లదనాన్ని అందించి, ముఖాన్ని తేటగా మారుస్తుంది.
ఇవే కాకుండా శనగపిండి, చందనం, అలోవెరా లాంటివాటితోనూ ఫేస్ ప్యాక్‌లు మంచి ఫలితాలను ఇస్తాయి.