Banana : బరువు పెరగాలనుకునేవారికి, ఆకలి తీర్చుకునేందుకు ఏ సమయంలోనైనా, ఎక్కడైనా సులభంగా తీసుకోదగిన అరటి పండు ఆరోగ్య ప్రయోజనాలనూ అందిస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అరటి పండు ఆరోగ్యకరమే కాకుండా పోషకాల గనిగా శరీరానికి తక్షణ శక్తిని సమకూరుస్తుంది.
ఇందులో శరీరానికి అవసరమైన విటమిన్లు, మినరల్స్ సహా రోగనిరోధక శక్తిని మెరుగుపరిచే విటమిన్ సీ, మెదడు పనితీరుకు అవసరమైన విటమిన్ బీ6 లభిస్తుంది. బీపీని నియంత్రించి, గుండె ఆరోగ్యానికి మేలు చేసే పొటాషియం ఉంటుంది. ఇక జీర్ణ సమస్యలతో ఇబ్బందులు పడే వారికి అరటి పండు దివ్యౌషధమని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
అరటిలో ఉండే ఫైబర్ జీర్ణక్రియ సాఫీగా సాగేలా చూడటంతో పాటు కడుపుబ్బరం, వికారాలను తగ్గిస్తుంది. అరటిలో ఉండే గ్లూకోజ్, ఫ్రక్టోజ్, సుక్రోజ్ వంటి సహజసిద్ధమైన చక్కెరలు తక్షణ శక్తిని సమకూర్చడంతో పాటు వర్కవుట్స్‌కు ముందు, పర్ఫెక్ట్ స్నాక్‌గానూ ఈ వండర్ ఫ్రూట్ పనికొస్తుంది.
Read More :
IT Raids | చట్నీస్ హోటల్స్‌పై ఐటీ దాడులు.. యజమాని ఇండ్లలోనూ సోదాలు