ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో నిద్ర సమయం తగ్గిపోతున్నది. రాత్రి వేళ తక్కువ సమయం నిద్రకు కేటాయిస్తున్నారు. జీవగడియారం నడవాలంటే నిద్ర ఎంతో ముఖ్యమైనదని అందరూ మరిచిపోయారు. శారీరక, మానసిక ఆరోగ్యాన్ని రక్షించడంలో నిద్ర ఎంతో ప్రధానమైనదని అందరూ విస్మరించారు. ఫలితంగా కొత్త కొత్త వ్యాధులకు గురువుతున్నారు.
ఆరోగ్యంగా ఉండాలంటే నిత్యం ఎవరైనా సరే 8 గంటల నిద్ర అవసరమని వైద్యులు చెప్తుంటారు. ప్రపంచ స్థాయి ఆరోగ్య సంస్థలు కూడా ఇదే విషయాన్ని నిర్ధారిస్తున్నాయి. అయితే, నిర్దేశించిన సమయం కాకుండా అంతకన్నా ఎక్కువ గంటలు నిద్రించే వారు కూడా చాలా మందే ఉన్నారు. అంటే 8 గంటలకు పైగా నిద్రించే వారన్నమాట. నిద్ర ఎక్కువైతే ఎలాంటి లాభాలు కలగకపోగా అన్నీ నష్టాలే కలుగుతాయని తేల్చాయి అధ్యయనాలు. అతి నిద్ర ఒకరకమైన దీర్ఘకాలిక నాడీ వ్యవస్థ రుగ్మతగా చెప్పుకోవచ్చు. మరి ఎక్కువ సేపు నిద్రిస్తే ఎలాంటి దుష్పరిణామాలు కలుగుతాయో తెలుసుకుందాం.
అతి నిద్రతో దుష్పరిణామాలు
ఈ సమస్య నుంచి బయటపడేందుకు..