న్యూఢిల్లీ : శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, పోషకాల గనిగా పేరొందిన మష్రూమ్స్ ఆరోగ్యానికి చేసే మేలు (Anti Ageing Diet) అంతా ఇంతా కాదు. మష్రూమ్స్‌లో ఔషధ గుణాలు పుష్కలంగా లభిస్తుండటంతో ఇవి ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన ఆహారంగా పేరొందాయి. వయసు మీదపడటం ద్వారా వచ్చే లక్షణాలను దీటుగా నిలువరించి వృద్ధాప్యాన్ని జాప్యం చేయడంలో మష్రూమ్స్ కీలకంగా పనిచేస్తాయని చెబుతున్నారు.
ఏజింగ్‌కు అడ్డుకట్ట వేసి ఆరోగ్యానికి మేలు చేకూర్చే యాంటీఆక్సిడెంట్స్ వీటిలో లభిస్తాయి. వీటిని తరచూ తీసుకుంటే దీర్ఘాయువు చేకూరడంతో పాటు ఆరోగ్యంగా వయసు మీరే ప్రక్రియకు తోడ్పాటు అందిస్తాయి. రీషీ మష్రూమ్స్ అనే వెరైటీ పుట్టగొడుగులు ఆరోగ్యం, దీర్ఘాయువును అందిస్తుంది. అందుకే వీటిని దశాబ్ధాలుగా చైనా వైద్య ప్రక్రియల్లో వినియోగిస్తున్నారు.
మష్రూమ్స్‌లో దీర్ఘాయువును ప్రేరేపించే ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని, వాపు ప్రక్రియను నివారిస్తాయని 2021లో న్యూట్రిషన్ జర్నల్‌లో ప్రచురితమైన పరిశోధన వెల్లడించింది. మష్రూమ్స్ బీపీని తగ్గించడంతో పాటు మధుమేహ నియంత్రణ, కొవ్వును తగ్గించడం, మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, ప్రేవుల ఆరోగ్యాన్ని కాపాడటం వంటి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలకు ఉపకరిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
Read More :
Brushing Tips | బ్రష్ చేసేటప్పుడు ఈ పొరపాట్లు చేస్తున్నారా?