PCOS | హార్మోన్ అసమతౌల్యం వల్ల ఏర్పడే సమస్య.. పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (పీసీవోఎస్). ఈ ఇబ్బంది గురించి ఈమధ్యకాలంలో చాలా వార్తలే వినిపిస్తున్నాయి. అవగాహన కూడా పెరుగుతున్నది. రుతుక్రమంలో మార్పులు, సంతానలేమికి కూడా ఇదొక కారణమని చెబుతున్నారు నిపుణులు. తొలిదశలో లక్షణాల్ని కనిపెట్టడం కష్టం కాబట్టి.. చాలా మంది పెద్దగా పట్టించుకోరు.
ఈ మధ్యే ప్రత్యేకమైన క్లినిక్స్ కూడా ఏర్పాటు అవుతున్నాయి. అలాంటిదే చెన్నైకి చెందిన THREOS. ఈ సంస్థ ఓ యాప్ను కూడా విడుదల చేసింది. ఈ యాప్ ద్వారా ఆడియో లేదా వీడియో కన్సల్టేషన్ పొందవచ్చు. సంస్థ అందించే వివిధ ఉత్పత్తులను కొనుక్కోవచ్చు. ఇతర సభ్యులతో మన అనుభవాలను పంచుకోవచ్చు. సమస్యను ఎప్పటికప్పుడు గమనించుకునేలా ఓవులేషన్ ట్రాకర్, వ్యాయామాన్ని బేరీజు వేసే యాక్టివిటీ ట్రాకర్ లాంటి ఎన్నో ఫీచర్స్ ఇందులో ఉన్నాయి.