వీటిని తింటే చర్మంపై ముడతలే ఉండవు.. ఏజ్ పెరిగినా అందంగా కనిపిస్తారు!!
వయస్సు పెరుగుతున్నా అందంగా కనిపించాలనుకుంటున్నారా? 40ఏళ్లు దాటినా చర్మం నిగనిగలాడాలని కోరుకుంటున్నారా? అయితే, సహజంగా కొల్లాజెన్ తీసుకునేందుకు ప్రయత్నించండి. కొల్లాజెన్ ప్రొటీన్ అనేది చర్మ సౌందర్యానికి అత్యంత ముఖ్యం. ఇది చర్మంలోని కణజాల కణాలను బలపరుస్తుంది. దానికి నిర్మాణాన్ని అందిస్తుంది. ఎముకలను కూడా దృఢంగా మారుస్తుంది.
వయస్సు పెరుగుతున్నా అందంగా కనిపించాలనుకుంటున్నారా? 40ఏళ్లు దాటినా చర్మం నిగనిగలాడాలని కోరుకుంటున్నారా? అయితే, సహజంగా కొల్లాజెన్ తీసుకునేందుకు ప్రయత్నించండి. కొల్లాజెన్ ప్రొటీన్ అనేది చర్మ సౌందర్యానికి అత్యంత ముఖ్యం. ఇది చర్మంలోని కణజాల కణాలను బలపరుస్తుంది. దానికి నిర్మాణాన్ని అందిస్తుంది. ఎముకలను కూడా దృఢంగా మారుస్తుంది.
మానవ శరీరం సహజంగా కొల్లాజెన్‌ను తయారు చేసే సామర్థ్యం కలిగి ఉంటుంది. వయస్సు పెరిగే కొద్దీ దీని ఉత్పత్తి తగ్గిపోతుంది. చర్మం స్థితిస్థాపకత, బిగుతును కోల్పోతుంది. దీంతో చర్మంపై ముడతలు, గీతలు ఏర్పడతాయి. మేక మాంసం, పంది మాంసం, గుడ్లు, చికెన్‌లాంటి వాటిలో కొల్లాజెన్ పుష్కలంగా ఉంటుంది. కొల్లాజెన్ కోసం చాలామంది సప్లిమెంట్స్ తీసుకుంటారు. ఇది చాలా అసహజమైన పద్ధతి అని నిపుణులు అంటున్నారు. కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకుంటే సహజ కొల్లాజెన్‌ను పొందొచ్చని, ఏజ్ పెరుగుతున్నా అందంగా ఉండొచ్చని చెబుతున్నారు.
కొల్లాజెన్ ఉండే ఆహారాలు ఇవే..
1. బోన్ సూప్..
ఎముకలు కనెక్టివ్ కణజాలంతో తయారవుతాయి. శరీరంలో సహజ కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడంలో సహాయపడే చాలా ఖనిజాలను ఇవి కలిగి ఉంటాయి. రోజువారీ ఆహారంలో బోన్సూప్ను చేర్చుకుంటే దీర్ఘకాలంలో చర్మం నిగనిగలాడుతుంది. కీళ్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది.
2. చికెన్
చికెన్‌లో ఉన్నంత కనెక్టివ్ టిష్యూస్ మొత్తానికి మరే ఇతర ఆహారంలో ఉండవు. చికెన్ నెక్, మృదులాస్థిని తరుచూ తీసుకుంటే మన చర్మ నిగారింపునకు కావాల్సిన సహజ కొల్లాజెన్ అందుతుంది. కీళ్ల ఆరోగ్యానికి కూడా ఇది ఉపయోగపడుతుంది.
3.గుడ్డులోని తెల్లసొన
గుడ్డులోని తెల్లసొనలో కేలరీలు తక్కువగా ఉంటాయి. కొల్లాజెన్ ఉత్పత్తికి అవసరమైన అమైనో యాసిడ్లలో ఒకటైన ప్రోలిన్ అధికంగా ఉంటుంది. చర్మ నిగారింపుకోసం రోజువారీ ఆహారంలో గుడ్డులోని తెల్లసొన చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
4. సిట్రస్ పండ్లు
విటమిన్ సీ.. కొల్లాజెన్ ఉత్పత్తిని విపరీతంగా పెంచుతుంది. నారింజ, నిమ్మ, ఫైనాపిల్, గ్రేప్ ఫ్రూట్ మొదలైన పండ్లలో విటమిన్ సీ పుష్కలంగా ఉంటుంది. వీటిని ఏదోరూపంలో ప్రతిరోజూ తీసుకోవాలి.
5. వెల్లుల్లి
వెల్లుల్లి ఆహారానికి రుచిని అందించడంతోపాటు కొల్లాజెన్ ఉత్పత్తిని కూడా పెంచుతుంది. వెల్లుల్లిలో సల్ఫర్ ఎక్కువగా ఉంటుంది. ఇది కొల్లాజెన్ విచ్ఛిన్నం కాకుండా సంశ్లేషణ చేయడంలో సహాయపడుతుంది.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్‌లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్‌బండ్‌పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

